
స్వగ్రామం చేరిన సాగర్ మృతదేహం
గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెందిన బత్తుల సాగర్(42) ఈ నెల 22న కువైట్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం మృతదేహం స్వగ్రామం చేరింది. ఉపాధి కోసం సాగర్ మూ డేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. కుటుంబ సభ్యుల రో ధనల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
గొల్లపల్లి: అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తిర్మాలాపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గండికోట రమేశ్ (37) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన సంపాదనతో భార్య మంజుల, ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో రెండేళ్ల క్రితం ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. ఈ క్రమంలో అప్పు చేశాడు. పిల్లల్లో ఒకరు అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య ఖర్చులకు మరింత అప్పు చేశాడు. వాటిని తీర్చేదారి లేక జీవితంపై విరక్తి చెంది సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు వచ్చేసరికే చనిపోయాడు. ఇంటి పెద్ద మృతిచెందడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. రమేశ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు.
వస్తువుల బహిరంగ వేలం
కరీంనగర్: నగరంలోని కార్ఖానగడ్డ ప్రభుత్వ దివ్యాంగుల, వయో వృద్ధుల వసతి గృహంలో నిరుపయోగంగా ఉన్న ఫర్నీచర్, బీరువాలు, చెక్క కప్‌బోర్డ్స్, ఫిజియోథెరపి చైర్ తదితర వస్తువులను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు వస్తువులను ప్రభుత్వ దివ్యాంగుల, వయో వృద్ధుల వసతి గృహంలో ఈనెల 28వ తేదీ వరకు పరిశీలించుకుని వేలంలో పాల్గొనవచ్చునని అన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పని దినములలో 8096338488, 9492930728 నంబర్లను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

స్వగ్రామం చేరిన సాగర్ మృతదేహం

స్వగ్రామం చేరిన సాగర్ మృతదేహం