
వార్డెన్‌పై చర్య తీసుకోవాలి
మంథని: మంథనిలో ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహ విద్యార్థులు గురువారం రోడ్డెక్కారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మెనూ ప్రకారం వార్డెన్ సరుకులు ఇవ్వడం లేదని, సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని వాపోయా రు. వారానికి ఒకసారి మాత్రమే వసతి గృహానికి వచ్చి సరుకులు ఇచ్చి వెళ్తున్నారని, అవి సరిపోవడం లేదని పేర్కొన్నారు. టిఫిన్ ఆలస్యమవుతుందని, తమ ఆలస్యంపై ప్రిన్సిపాల్ పలుమా ర్లు హెచ్చరించారని ఆవేదన వెలిబుచ్చా రు. విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు సంఘాల జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, గొర్రంకల సురేశ్ మాట్లాడుతూ, విద్యార్థులకు సమయానికి సరుకులు ఇవ్వకుండా, రోజువారీ మెనూ పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్ రమేశ్‌పై చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. డివిజన్, జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో వసతి గృహాల సంరక్షకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరో పించారు. విద్యార్థులు, నాయకులకు పోలీసులు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు.
రామానుజమ్మకు జాతీయ పురస్కారం
సిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రానికి చెందిన వెటరన్ అథ్లెట్ టమటం రామానుజమ్మకు మరో ప్రతిభ పురస్కారం వరించింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వైఎంకే అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ ఎక్సలెంట్ అవార్డులను ప్రదానం చేశారు. సిరిసిల్లకు చెందిన వెటరన్ అథ్లెట్, మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ టమటం రామానుజమ్మను ఎంపిక చేశారు. వైఎంకే అధ్యక్షుడు, సినీ నటుడు భానుచందర్ అవార్డును అందజేశారు. ఏడుపదుల వయసులో జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న రామానుజమ్మను పలువురు అభినందించారు.

వార్డెన్‌పై చర్య తీసుకోవాలి