రాయికల్‌ ఆస్పత్రిలో వైద్యుల కొరత | - | Sakshi
Sakshi News home page

రాయికల్‌ ఆస్పత్రిలో వైద్యుల కొరత

May 7 2025 12:08 AM | Updated on May 7 2025 12:08 AM

రాయిక

రాయికల్‌ ఆస్పత్రిలో వైద్యుల కొరత

● గతంలో ఎనిమిది మంది.. నేడు నలుగురే ● ఉన్నవారంతా డిప్యూటేషన్‌పైనే.. ● సెలవులో వెళ్లనున్న డీజీవో? ● వైద్య విధాన పరిషత్‌ ఉన్నట్లా..? లేనట్లా..?

రాయికల్‌: రాయికల్‌లోని కమ్యునిటీ హెల్త్‌ సెంటర్‌ను 2022లో వైద్య విధాన పరిషత్‌లోకి మారుస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయినా ఇప్పటివరకు ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేయకపోవడంతో ఆస్పత్రి వైద్య విధాన పరిషత్‌లో ఉన్నట్లా..? లేనట్లా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంతోపాటు మండలంలోని 32 గ్రామాల్లోని నిరుపేదలకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించాల్సిన ఈ ఆస్పత్రిలో వైద్యులు కొరత తీవ్రంగా ఉంది. గతంలో ఇక్కడ ఎనిమిది మంది పనిచేయగా.. ప్రస్తుతం నలుగురే ఉన్నారు. ఫలితంగా ఇప్పుడున్న వైద్యులు, పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రాయికల్‌ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ శశికాంత్‌రెడ్డి, గైనకాలజిస్ట్‌ ఒడ్నాల రజిత, మత్తు డాక్టర్‌గా శ్రీకాంత్‌, ఛాతి వైద్య నిపుణులు వాణి మాత్రమే ఉన్నారు. ఈ ఆస్పత్రికి ప్రతిరోజు 150 నుంచి 200 వరకు ఓపీ ఉంటుంది. వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో ఉన్న వైద్యులపైనే పనిభారం పడుతోంది. వాస్తవానికి శశికాంత్‌రెడ్డికి ధర్మపురి, రజితకు ధర్మపురి, శ్రీకాంత్‌కు జగిత్యాల, వాణికి జగిత్యాల ఆస్పత్రుల్లో పోస్టింగ్‌. అయితే రాయికల్‌ ఆస్పత్రికి డిప్యూటేషన్లపై వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో పనిచేసిన డాక్టర్‌ రవి ధర్మపురి, రమేశ్‌ కోరుట్ల, శ్రీలత కరీంనగరర్‌కు బదిలీ అయ్యారు. తేజస్విని మాత్రం సెలవులో ఉన్నారు. ప్రస్తుతం సీ్త్రవైద్య నిపుణులుగా పనిచేస్తున్న డాక్టర్‌ ఒడ్నాల రజిత మరో రెండుమూడు రోజుల్లో సెలవుల్లో వెళ్లనున్నట్లు సమాచారం. ఈ ప్రభావం ఆస్పత్రిలో ప్రసవాలపై పడే అవకాశం కనిపిస్తోంది. జిల్లా వైద్య విధాన పరిషత్‌ కో–ఆర్డినేటర్‌ స్పందించి రాయికల్‌ ఆస్పత్రికి సరిపడా వైద్యులను నియమించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది.

పట్టించుకోని వైద్య విధాన పరిషత్‌

రాయికల్‌ ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్‌లోకి మార్చుతూ ఆదేశాలు జారీ చేసినా.. అప్‌గ్రేడ్‌ చేయకపోవడంతో ఆస్పత్రికి మంజూరు కావాల్సిన వైద్య పోస్టులు భర్తీ కావడం లేదు. ఫలితంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరిని కలవాలో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎమ్మెల్యే సంజయ్‌ స్పందించి ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్‌లోకి అప్‌గ్రేడ్‌ చేసి వైద్యులను నియమించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

రాయికల్‌ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉన్న విషయం వాస్తవమే. ఈ విషయాన్ని పలుమార్లు జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఉన్న వైద్యులతోనే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటలపాటు వైద్య సేవలు అందిస్తున్నాం.

– శశికాంత్‌రెడ్డి, సూపరింటెండెంట్‌

రాయికల్‌ ఆస్పత్రిలో వైద్యుల కొరత1
1/1

రాయికల్‌ ఆస్పత్రిలో వైద్యుల కొరత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement