
ప్రజావాణికి వినతుల వెల్లువ
● భారీగా తరలివచ్చిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన అధికారులు ● పరిష్కరించాలని ఆదేశాలు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు జిల్లావ్యాప్తంగా తరలివచ్చారు. వారి నుంచి అదనపు కలెక్టర్ బీఎస్.లత అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 60 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిశీలించిన అనంతరం లత మాట్లాడారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వలస కార్మికులకు వసతులు కల్పించండి
చల్‌గల్ మామిడి మార్కెట్లో పనిచేసే వలస కార్మికులకు కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. స్నానం చేసేందుకు.. మల, మూత్ర విసర్జనకు కనీస వసతులు లేవు. బహిరంగ ప్రదేశాలను వినియోగిస్తుండటంతో మార్కెట్ పరిసరాలు దుర్గంధభరితంగా తయారవుతున్నాయి. మార్కెట్ ప్రాంతాల్లో దోమలు, పందులు వృద్ధిచెంది రోగాలకు కారణమవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో స్నానాలు చేయలేక ఇబ్బంది పడుతున్న మహిళా వలస కార్మికుల హక్కులను కాపాడాలి.
– కాసారపు రమేశ్ చల్‌గల్

ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రజావాణికి వినతుల వెల్లువ