ఎల్‌ఆర్‌ఎస్‌కుస్పందన అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌కుస్పందన అంతంతే..

Apr 30 2025 1:54 AM | Updated on Apr 30 2025 1:54 AM

ఎల్‌ఆర్‌ఎస్‌కుస్పందన అంతంతే..

ఎల్‌ఆర్‌ఎస్‌కుస్పందన అంతంతే..

● 25 శాతం గడువు నేటితో ముగింపు ● అవగాహన కల్పించినా ఫలితం శూన్యం ● ఫీజు చెల్లింపునకు ముందుకు రాని ప్రజలు

జగిత్యాల: అక్రమ పాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు ప్రభుత్వం 25శాతం రాయితీ ప్రకటించింది. ముందుగా మార్చి 31వరకే గడువు విధించినా ప్రజలు ముందుకు రాకపోవడంతో ఈనెల 30 వరకు పెంచింది. అయినప్పటికీ ఆదాయం అంతంతమాత్రంగానే వచ్చింది. దాదాపు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినా స్పందన అంతంతమాత్రమే లభిస్తోంది. క్రమబద్ధీకరణ కోసమని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకోగా.. పరిష్కరించడంలో అప్పుడు నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించాలని, 25శాతం రాయితీ ప్రకటించినా స్పందన లభించలేదు.

జిల్లాలో 27,484 దరఖాస్తులు

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో లే అవుట్ల క్రమబద్ధీకరణకు 27,484 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం 25శాతం రాయితీ కల్పించినా ఇప్పటివరకు రూ.11.77 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. 3,579 మంది ఫీజు చెల్లించారు. 869 మాత్రమే ప్రొసీడింగ్‌లు ఇచ్చారు. ఇంకా చాలామంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో 25 శాతం రాయితీపై ఫ్లెక్సీలు, వాల్‌రైటింగ్స్‌ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టినా ప్రజలు ముందుకు రాలేదు.

నిషేధిత జాబితాలోకి వెళ్లడంతోనే..

చాలామంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా కొందరివి నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సాంకేతిక కారణాలతోనే నిషేధిత జాబితాలో చేరడంతో సంబంధిత దరఖాస్తుదారులు వాటిని సరిచేయాలంటూ ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వారు కూడా పట్టించుకోవడం లేద న్న ఆరోపణలున్నాయి. ఒకవైపు గడువు ముగి యనుండగా.. అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యగా మారింది. ఎల్‌ఆర్‌ఎస్‌ మూడు దశల్లో దరఖాస్తులు పూర్తి చేస్తున్నారు. ఎల్‌–1, ఎ ల్‌–2, ఎల్‌–3 దశల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఎల్‌–1లో ఇరిగేషన్‌ అధికారులు, ఎల్‌–2లో రెవె న్యూ, ఎల్‌–3లో మున్సిపాలిటీ వారు ఉన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఒకవేళ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోకి వస్తే వాటిని పరిశీలించి ఇరిగేషన్‌ అధికారులు ఉందా..? లేదా..? అ న్నది చూసి ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. రెవె న్యూ అధికారులు ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకో వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదేశాలిచ్చాం

దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదని డీఈలకు ఆదేశాలు ఇచ్చాం. సుమారు అన్ని దరఖాస్తులను పరిష్కరించాం. ఏవైనా భూములు ఎఫ్‌టీఎల్‌లో ఉంటేనే సమస్యగా ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉంటే ఎన్‌వోసీ ఇస్తున్నాం.

– ఖాన్‌, ఇరిగేషన్‌ ఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement