రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

Mar 26 2026 7:52 AM | Updated on Mar 26 2026 7:52 AM

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల):రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కప్పుసాసర్‌ డివైడర్‌ను ఆటో ఢీన్న ఘటనలో చికిత్స పొందుతున్న రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన బొమ్మనవేణి రాజు(39) బుధవారం మృతిచెందాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. రాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 23న ఉదయం కరీంనగర్‌ డెయిరీకి చెందిన పాల క్యాన్లతో ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా స్థానిక పాతబస్టాండ్‌లో ఆటో అదుపుతప్పి కప్పుసాసర్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో రాజు అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం వేకువజామున మరణించాడు. మృతునికి భార్య ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు.

రాచర్ల బొప్పాపూర్‌లో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement