పాముకాటుతో వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో వృద్ధురాలి మృతి

Mar 26 2026 7:52 AM | Updated on Mar 26 2026 7:52 AM

ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధ ర్మారం మండలం పైడిచింతల పల్లి పంచాయతీ శివారులోని గురుపల్లికి చెందిన నాంపెల్లి ల స్మమ్మ(78) బుధవారం పాముకాటుతో మరణించినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. తన ఇంటి ఎదుట చింతపండు ఆరబెట్టి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. ఈ సమయంలోనే విషపాము కుడిచేతిపై కాటు వేసింది. మెలకువ వచ్చిన వృద్ధురాలు కేకలు వేసింది. స్థానికులు వెంటనే పెద్దపల్లి, అక్కడ నుంచి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. మృతురాలి కూతురు నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement