● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
జగిత్యాలటౌన్: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేయాల్సిందేనని, లేకుంటే బీఆర్‌ఎస్ గతే పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి నాయక్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసిందేమీలేదన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కులగణనకు బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఎంపీగా అర్వింద్ జగిత్యాల జిల్లా అభివృద్ధికి నయాపైసా ఖర్చు చేయలేదన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు అందడం లేదన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, తప్పెట్ల స్కైలాబ్‌బాబు, జిల్లా కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఇందూరి సులోచన, కోమటి చంద్రశేఖర్, ఎంఏ చౌదరి, మహిపాల్‌నాయక్ వినోద్ పాల్గొన్నారు.