భారత్‌లో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధిగా కరోనా: డబ్ల్యూహెచ్‌ఓ

WHO Says Covid Likely to Remain The Same For A Few More Days In India - Sakshi

జెనీవా: భారత్‌లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. పిల్లలకు కరోనా సోకినా వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే. సార్స్-కోవి-2ను అంతం చేయొచ్చా అని ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్' గత జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా మ్యునాలజిస్టులను, వైరాలజిస్టులను, ఆరోగ్య నిపుణులను అడిగింది. 'నిర్మూలించడం కుదరదు' అని వారిలో 90శాతానికి పైగా సమాధానమిచ్చారు.

చదవండి: Finn Allen: వ్యాక్సిన్‌ రెండు డోసుల తర్వాత క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top