Twosday 2022: What Is Palindrome And Ambigram Dates, Know Its Significance - Sakshi
Sakshi News home page

Twos Day 2022: పాలిండ్రోమ్‌, అంబిగ్రామ్‌.. ఇవాళ వాట్సాప్‌లో విపరీతంగా వైరల్‌ అయినవి ఇవే!

Feb 22 2022 6:41 PM | Updated on Feb 22 2022 8:02 PM

What Is Palindrome Ambigram Dates Amid Tuesday Became Twos Day - Sakshi

రాత్రి మొదలైన ఫార్వర్డ్‌ మెజేస్‌ల మోత.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

22-02-2022.. అఫ్‌కోర్స్‌ ఇవాళ్టి ఈ తేదీ ప్రత్యేకత గురించి చెప్పనక్కర్లేదు. నిన్నటి నుంచి సోషల్‌ మీడియాలో ఈ తేదీ మీద స్టేటస్‌లు, ఫార్వర్డ్‌ మెసేజ్‌లు చూస్తూ ఉన్నారు కదా. పొద్దున గుడ్‌మార్నింగ్‌ మెసేజ్‌ ప్లేస్‌లో చాలామంది ఈ మెసేజ్‌తో ఛాటింగ్‌ మొదలుపెట్టి ఉంటారు. Tuesday ను Twosdayగా వర్ణిస్తూ.. సోషల్‌ మీడియాలో విపరీతంగా మీమ్స్‌ వైరల్‌ అయ్యాయి.. అవుతున్నాయి కూడా.  మరోపక్క ట్రోలింగ్‌ సంగతి సరేసరి!. మరి ఈ స్పెషల్‌ డేకు కొన్ని పేర్లుంటాయి అని తెలుసా?


2-2-22.. సాధారణంగా ఇలాంటి తేదీలను సిమ్మెట్రికల్‌ లేదంటే పాలిండ్రోమ్‌ అంటారు. ముందు, వెనకాల నుంచి చదివినా ఒకేలా ఉంటాయి కాబట్టి ఆ పేరొచ్చింది. రెండు అనే అంకె కారణంగా మళ్లీ రెండు వందల ఏళ్ల తర్వాతే 2 అనే నెంబర్‌ మీద ఇలాంటి తేదీ వస్తుంది. 

పాలిండ్రోమ్‌ చివరిసారిగా 11 జనవరి 2011(11-1-11)లో కనిపించింది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత మార్చి 3, 2033లో.. 3-3-33గా వస్తుంది.


పోస్టులే..

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం ఈ ప్రత్యేక డేట్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు. నటి సమంత కొత్త చిత్రం ‘Kaathuvaakula Rendu Kaadhal’ టూ టూ టూ టూ సాంగ్‌ మీమ్స్‌లో మారుమోగిపోతోంది. ఇందులో విజయ్‌ సేతుపతి సామ్‌, నయన్‌ ఇద్దరినీ ఒకేసారి లవ్‌ చేస్తాడులేండి. నేహా ధూపియా, రవీనా టాండన్‌లాంటి బాలీవుడ్‌ వాళ్లూ ఈ తేదీని ఆస్వాదించారు. 

  


అంబిగ్రామ్‌ అంటే.. 

ఇవాళ్టి తేదీ పాలిండ్రోమ్‌ మాత్రమే కాదు.. అంబిగ్రామ్‌ కూడా. అటు ఇటు మాత్రమే కాదు.. పూర్తి తేదీని ఉల్టాపల్టా చేసినా కూడా అదే తేదీ కనిపిస్తుందట. 22-02-2022.. ఇలాగన్నమాట. 

ఇదిలా ఉంటే 21వ శతాబ్ధంలో మొత్తం 12 పాలిండ్రోమ్‌ తేదీలు ఉన్నాయి. మొదటిది.. అక్టోబర్‌ 2, 2001(10-02-2001). చివరిది.. 29 ఫిబ్రవరి 2092(29-02-2092)లో రానుంది. విశేషం ఏంటంటే.. లీప్‌ ఈయర్‌ కావడం వల్లే ఈ తేదీ రావడం. ఈ మధ్యలో వచ్చే Feb 8, 2080 (08-02-2080) దాకా మనం బతికి ఉంటామో లేదో అంటూ మీమ్స్‌ పెడుతున్నారు ఉన్నారు. 

సంబంధిత వార్త: మళ్లీ మళ్లీ ఇది రానిరోజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement