ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేశాం: వైట్‌హౌస్‌ సంచలన ప్రకటన | war ends The White House to US congress | Sakshi
Sakshi News home page

ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేశాం: వైట్‌హౌస్‌ సంచలన ప్రకటన

May 2 2026 12:37 AM | Updated on May 2 2026 2:14 AM

 war ends The White House to US congress

వాషింగ్టన్‌: ఇరాన్‌తో జరిగిన యుద్ధంపై వైట్‌హౌస్‌ ప్రకటన చేసింది. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేశామని యూఎస్‌ కాంగ్రెస్‌కు వైట్‌హౌస్‌ తెలిపింది. పశ్చిమాసియాలో దళాలు ఉన్నప్పటికీ వైట్‌హౌస్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 

ఇరాన్‌తో ఇప్పుడు కాల్పుల విరమణ ఉంది కాబట్టి యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ వాదిస్తోంది. అమెరికాలో 60 రోజుల లోపు యుద్ధంపై కాంగ్రెస్‌కు వెళ్లి అనుమతి తీసుకోవాలి లేదా యుద్ధాన్ని ఆపాలన్న నిబంధన ఉంది. కాబట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ ఇలా చెప్పి ఆ గడువు నుంచి తప్పించుకోవాలని చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

యుద్ధం ఇప్పటికే ముగిసింది కాబట్టి కాంగ్రెస్ అనుమతి అవసరం లేదనేదే లాజిక్. ఇది ఒక లీగల్ స్ట్రాటజీ అయి ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. 1973 వార్ పవర్స్ రిజల్యూషన్ (అధ్యక్షుడు సైనిక చర్యల కోసం అనుసరించాల్సిన చట్టపర పరిమితులు నిర్ణయించే చట్టం) ప్రకారం.. కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలు చేపట్టవచ్చు. ఆ తర్వాత వాటిని ముగించాలి లేదా కాంగ్రెస్ అనుమతి కోరాలి లేదంటే అమెరికా సాయుధ దళాల భద్రతకు సంబంధించిన తప్పనిసరి సైనిక చర్య అవసరమైతే మరో 30 రోజుల పొడిగింపు కోరాలి. అదీ బలగాల ఉపసంహరణ సమయంలో విజ్ఞప్తి చేయాలి.

యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఆ రోజు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై గగనతల దాడులు ప్రారంభించాయి. మొదటి గగనతల దాడుల తర్వాత 48 గంటల్లో ట్రంప్ అధికారికంగా కాంగ్రెస్‌కు ఈ ఘర్షణ గురించి సమాచారం ఇచ్చారు. దాంతో 60 రోజుల గడువు మే 1న ముగిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement