Viral Video: విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు...

Viral Video Shows Fish Being Dropped Into Lake During Restocking - Sakshi

ఇంతవరకు ఎన్నో రకాల వైరల్‌ వీడియోలు చూశాం. వాటిని చూసి అబ్బురపడ్డాం. కానీ వాటన్నింటికంటే భిన్నమైన వైరల్‌ వీడియో ఇది. ఈ వీడియో చూస్తే ఇది నిజమేనా! అనిపిస్తుంది. కళ్లముందు సాక్ష్యంగా వైరల్‌ వీడియో కనిసిస్తున్న నమ్మశక్యంగా అనిపించదు. ఇంతకీ ఏంటా వీడియో? ఏముందంటే...

వివరాల్లోకెళ్తే....సరస్సుల పునరుద్ధరణలో భాగంగా ఓ విమానం చేపలను సరస్సులో పడేస్తోంది. చిన్న చిన్న చేపలను నీటితో సహా ఒక్కసారిగా నీటిలో చల్లుకుంటూ వెళ్తోంది. ఇలా చేపలు లేని సరస్సుల్లో వేస్తుంటారు. ఈ ఘటన వాసచ్‌ పర్వత ప్రాంతంలోని సిల్వర్‌ లేక్‌ ఫ్లాట్‌  రిజర్యాయర్‌లో చోటు చేసుకుంది. ఇలా వైమానిక పద్ధతిలో చేపలను సరస్సులో వదలడం 1956 నుంచి మొదలైంది.

ఇది అక్కడ స్థానిక సరస్సులోని చేపలను ఏ మాత్రం ప్రభావితం చేయదని అంటున్నారు అధికారులు. ఇలా ఎక్కువగా చేపల పునరుత్పత్తి లేని సరస్సులోనే చేస్తామని వివరించారు. అంతేకాదండోయ్‌! 1950 దశకానికి ముందు దూర ప్రాంతాలకు  చేపలను తరలించాలంటే గుర్రం పాలను సేకరించి వాటిలో వేసి తీసుకువెళ్లేవారంట. ఐతే ఇలా వైమానిక పద్ధతిలో చేపలను తరలించడం కొంచెం ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ చాలా త్వరిత గతిన అయిపోతుందంటున్నారు అధికారులు. ఈ వీడియోని ఉటా డివిజన్‌కి చెందిన వైల్డ్‌ లైఫ్‌ రీసోర్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

(చదవండి: విమానాశ్రయంలో ఏకంగా 109 జంతువులు కలకలం...షాక్‌లో అధికారులు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top