
ఉత్తర ఇటలీలోని బ్రెస్సియాలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నపాటి విమానం హైవేపై కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. మృతులను మిలన్‌కు న్యాయవాది సెర్గియో రావాగ్లియా(75), ఆయన భార్య ఆన్ మారియా డి స్టెఫానో (60)గా గుర్తించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రావాగ్లియా హైవేపై అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం విఫలం కావడంతో.. వేగంగా దూసుకొచ్చిన విమానం ముందు భాగం రోడ్డును ఢీకొట్టింది. దీంతో భారీ మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఇద్దరు వాహనదారులు కూడా గాయపడ్డారు.. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే ఆ విమానం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఇటలీ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫ్లైట్ సేఫ్టీ దర్యాప్తు చేపట్టింది.
🚨 PLANE CRASHED in the middle of the Highway - HORRIFIC VISUALS
Brescia, Italy - A small private plane tragically crashed onto a highway
The 75 year old Pilot and his partner BOTH DEAD
Too many Plane Crashes in the last few weeks :'( pic.twitter.com/iRewT9Zz5r— Gautam Seth (@GautamS15540834) July 25, 2025
కాగా, ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రమాదాలకు పైలట్స్, విమానంలో సాంకేతిక లోపాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.