ట్రంప్‌ ప్రమాణస్వీకారం రోజు అరగంట ఏడ్చాను: మిచెల్‌ ఒబామా

USA: Michelle Obama Cried For 30 Minutes On Trumps Inauguration - Sakshi

వాషింగ్టన్‌: 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారం రోజున వైట్‌హౌస్‌ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని, ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేనని మాజీ ప్రథమ మహిళ మిచెల్‌ ఒబామా వెల్లడించారు. ది లైట్ పాడ్‌కాస్ట్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయలను గుర్తుచేసుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తాము వైట్‌హౌస్‌ను విడిచిపెట్టడం చాలా బాధగా అనిపించిందని, ఆ క్షణాల్లో ఆమె పడిన అవేదనను తలుచుకుంటూ అప్పటి విషయాలను చెప్పుకొచ్చారు.

తెలియన బాధ... అరగంట ఏడ్చాను
ట్రంప్‌ ప్రమాణస్వీకారం రోజు అనేక కారణాల వల్ల ఆ రోజు కన్నీళ్లు కూడా వచ్చినట్లు చెప్పారు. వైట్‌హౌస్‌తో తమకు ఎనిమిదేళ్ల అనుబంధం ఉందని, అది తమ పిల్లలకు తెలిసిన ఏకైక ఇల్లుగా పేర్కొన్న మిచెల్‌.. ఆ ఇంటిని విడిచిపెట్టే రోజు చాలా ఉద్వేగానికి లోనయ్యానని చెప్పుకొచ్చారు. మా పిల్లల స్వస్థలం చికాగో అయినప్పటికీ, వాళ్లు అక్కడికంటే ఎక్కువ సమయం వైట్‌హౌస్‌లో గడిపారన్నారు. 

వీటితో పాటు అక్కడ పని చేసే సిబ్బందితో కూడా బంధం ఏర్పడిందని, వారిని వదిలిపెట్టాల్సి రావడం కూడా బాధగా అనిపించిందన్నారు. ఈ విషయంపై ఆమె కొనసాగిస్తూ.. ‘ఆ రోజు ఎందుకో నాలో కన్నీళ్లు, భావోద్వేగం ఉన్నాయి. వేదికపై కూర్చున్న మాకు ఎదురుగా ఉన్న స్క్రీన్‌పై మేము కనిపిస్తున్నాం.

ఆ వేదికపై ఎలాంటి వైవిధ్యం, కళ లేదు. అమెరికా విశాల భావానికి ప్రతిబింబం లేదు’ అని భావోద్వేగంతో వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ వన్ ఫ్లైట్‌లో ఎక్కిన మరుక్షణం తనలో దుఃఖం కట్టలు తెంచుకున్నట్లు తెలిపారు. ఆ బాధను తట్టుకోలేక 30 నిమిషాలు నిర్విరామంగా ఏడ్చానని మాజీ ప్రథమ మహిళ అప్పటి విషయాలును గుర్తుచేసుకున్నారు.

చదవండి: షాకింగ్.. ఇంట్లో 1,000 కుక్కలు మృతి.. ఆకలితో కడుపు మాడ్చి!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top