వాషింగ్టన్: ఇరాన్‌తో చేస్తున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నామన్నారు. టెహ్రాన్‌తో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో మీడియాలో పోస్టు చేశారు.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులను ట్రంప్ వాయిదా వేశారు. టెహ్రాన్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే.
ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ విషయాన్ని హ్యాపీగా తెలియజేస్తున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా పశ్చిమాసియాలో ఘర్షణలకు పూర్తి పరిష్కారం దిశగా ఫలప్రదమైన చర్చలు జరిపాయి. ఈ నిర్మాణాత్మక చర్చల ఆధారంగా.. నేను మా యుద్ధ సైనికులను ఓ విషయం చెప్పాను. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై జరిగే అన్ని సైనిక దాడులను 5 రోజులపాటు వాయిదా వేయాలని ఆదేశించాను’ అని అన్నారు.


