అమెరికాలో వలసదారుల ఏరివేతకు ఇమ్మిగ్రేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.మొన్నటికి మొన్న మిన్నెసోటాలోని ఐదేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు.. ఇప్పుడు తాజాగా మరో చిన్నారిని అరెస్ట్ చేశారు. మినియాపాలిస్‌లో రెండేళ్ల క్లోయ్ రెనాటాను ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు.
క్లోయ్ రెనాటా తన తండ్రితో కలిసి కిరాణా దుకాణం నుంచి తిరిగి వస్తుండగా వారిని ఒక గుర్తు తెలియని వాహనం వెంబడించింది. అధికారులు కారు అద్దాన్ని పగలగొట్టి, ఎటువంటి జుడిషియల్ వారెంట్ చూపకుండానే తండ్రీకూతుళ్లను తీసుకెళ్లారు. అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను"అని మిన్నియాపాలిస్ సిటీ కౌన్సిల్ సభ్యుడు జేసన్ చావెజ్ పేర్కొన్నారు.
ఈ ఘటనపై కోర్టు స్పందిస్తూ చిన్నారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలను లెక్కచేయకుండా హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) విభాగం వారిని విమానంలో టెక్సాస్‌లోని ని డిటెన్షన్ సెంటర్‌కు తరలించింది. అయితే వారి ఫ్యామిలీ లాయర్ కిరా కెల్లీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ పాపను డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల చేసినట్లు తెలుస్తోంది.


