మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు

US college offers porn class  - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోని ఓ కాలేజీ మొట్టమొదటిసారిగా పోర్నోగ్రఫీపై కోర్సును ప్రవేశపెట్టింది. 2022–23 విద్యాసంవత్సరంలో ఈ కోర్సు ఉంటుందని ఉటాలోని వెస్ట్‌మినిస్టర్‌ కాలేజీ ప్రకటించింది. లైంగికావయవాలను గురించి, వివిధ రకాల లైంగిక చర్యల గురించి కోర్సులో బోధిస్తామని తెలిపింది. కోర్సులో భాగంగా లెక్చరర్లు, విద్యార్థులు తరగతి గదిలోనే కలిసి కూర్చుని పోర్న్‌ సినిమాలను తిలకిస్తూ స్త్రీ, పురుష లైంగిక సంబంధాలపై జాతి, వర్గం, లింగ విభేదాల ప్రభావం గురించి చర్చలు జరుపుతారని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

సామాజిక అంశాలను విశ్లేషించేందుకు, వివాదాస్పద అంశాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇది ఒక అవకాశమని తెలిపింది. అయితే, విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతిలో అశ్లీల చిత్రాలను కలిసి చూడటం చాలా అసహ్యకరమైన వ్యవహారమంటూ కళాశాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top