బ్రిటన్‌ 20 శాతం టీకాలను పేద దేశాలకు ఇవ్వాలి: యూనిసెఫ్‌

Uk Could Share Poor Countries Available Coronavirus Vaccines Unicef - Sakshi

లండన్:  గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ అడ్డుకట్టకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని భావించి ఆయా దేశాల శాస్త్రవేత్తలు వాళ్ల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సంపన్న దేశాలు పరిస్థితి బాగానే ఉంది కానీ పేద దేశాలు టీకాలను తయారు చేసుకోలేక, ఇతర దేశాలనుంచి కొనుగోలు చేసుకోలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ సంస్థ ( యూనిసెఫ్‌ల) దీని పై స్పందించింది. బ్రిటన్ వద్ద ఉన్న కరోనా వ్యాక్సిన్లలో 20 శాతం టీకాలను పేదదేశాలకు విరాళంగా ఇవ్వాలని యూనిసెఫ్ సూచించింది.

పేద దేశాలను పట్టించుకోండి
జూన్ మొదటివారం నాటికి టీకాలను పంపించే విధంగా బ్రిటన్‌ చర్యలు చేపట్టాలని సూచించింది. ఇలా చేసినప్పటికీ బ్రిటన్ దగ్గర జూలై చివరినాటికి ఆ దేశపౌరులైన వయోజనులకు ఇచ్చేందుకు సరిపడా టీకాలు ఉంటాయని ఆ సంస్థ వివరించింది. కాగా ఇప్పటికే బ్రిటన్‌లో దాదాపు 18 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆ దేశం పూర్తి చేసింది. ఇక అధిక శాతం వయోజనులకు కనీసం ఒక డోసు టీకాను కూడా పూర్తి చేసింది. ప్రపంచంలోని 5 కోట్ల మంది ప్రజలకు టీకాలు అందించే సామర్థ్యం బ్రిటన్‌కు ఉందని ఈ సందర్భంగా తెలిపింది. బ్రిటన్‌ను చూసి మిగతా జీ-7 దేశాలు సైతం సాయం కోసం అలమటిస్తున్న ఇతర దేశాలకు టీకాలు పంపించే అవకాశం ఉంటుందని యూనిసెఫ్ అభిప్రాయపడింది. ఇతర దేశాల ప్రజలకు టీకాలు అందుబాటులో ఉన్నప్పడే మరో కొత్త రకం వైరస్‌లు  పుట్టుకురాకుండా ఉంటాయని యూనిసెఫ్ తెలిపింది. 

( చదవండి: ‘ఈ వేరియంట్‌ వల్లే భారత్‌లో కరోనా కల్లోలం’ )
  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top