ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. కొడుకు పెళ్లికి దూరం! | Trump To Miss Sons Wedding Amid Iran Talks And White House Commitments, More Details Inside | Sakshi
Sakshi News home page

ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. కొడుకు పెళ్లికి దూరం!

May 23 2026 2:53 AM | Updated on May 23 2026 10:00 AM

Trump to miss sons wedding amid Iran talks, White House commitments

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వారాంతంలో జరగనున్న తన పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ వివాహ వేడుకకు తాను హాజరుకావడం లేదని ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు, ఇతర బాధ్యతల కారణంగా వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లోనే ఉండవలసి వస్తోందని ఆయన తెలిపారు. ట్రంప్ జూనియర్, సోషలిస్ట్ బెట్టీనా అండర్సన్ ల వివాహం బహామాస్ లోని ఒక చిన్న ద్వీపంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనుంది.

"నా కొడుకు, కాబోయే కోడలు బెట్టీనా పెళ్లి వేడుకలో పాల్గోనాలని ఎంతో ఆశపడ్డాను. కానీ  దేశంపై ప్రేమ, ప్రభుత్వ బాధ్యతల వల్ల వెళ్లలేకపోతున్నాను. ఈ కీలక సమయంలో నేను వాషింగ్టన్ వైట్‌హౌస్‌లోనే ఉండటం అవసరం." అని ట్రంప్ పేర్కొన్నారు 

కాగా ఇరాన్‌తో నడుస్తున్న యుద్ధాన్ని ముగించడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం కీలక దౌత్య చర్చలు జరుగుతున్నాయి. ఈ కారణంతో ట్రంప్‌ తన కుమారుడు పెళ్లికి హాజరు కాలేకపోతున్నారు. 

ఇక ట్రంప్ జూనియర్‌కు ఇది మూడో వివాహం. ఆయన మొదటి భార్య మాజీ మోడల్‌ వెనెస్సాతో 12 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2018లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత టీవీ సెలబ్రిటీ కింబర్లీ గిల్‌ఫాయిల్‌తో నిశ్చితార్థం జరిగింది, కానీ 2024లో విడిపోయారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జూనియర్‌ ట్రంప్‌ పెళ్లి పీటలెక్కనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement