మరీ ఇంత కోపమా.. 26వ అంతస్తు నుంచి వేలాడదీసిందిగా..!

Thai Woman Cuts Support Rope for Painters Working on 26th Floor of Building - Sakshi

థాయ్‌ల్యాండ్‌లో చోటు చేసుకున్న సంఘటన

సపోర్ట్‌ వైర్‌ కట్‌ చేయడంతో 26వ అంతస్తు నుంచి గాల్లో వెలాడిన పెయింటర్లు

బ్యాంకాక్‌: సాధారణంగా ఎవరైనా మనకు కోపం తెప్పించే పని చేస్తే.. గట్టిగా అరుస్తాం.. లేదా చేతిలో ఉన్న వాటిని విసిరేస్తాం. అంతేతప్ప.. కోపంలో అవతలి వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చే పని చేయం కదా. కానీ థాయ్‌ల్యాండ్‌లో ఓ మహిళ ఆగ్రహం.. ఆమెకు జైలు జీవితాన్ని.. ఇద్దరు వ్యక్తులకు బతికుండగానే చావును పరిచయం చేసింది. సదరు వ్యక్తుల మీద ఆగ్రహించిన మహిళ.. ఏకంగా వారిని 26వ అంతస్తు నుంచి కిందకు వేలాడేలా చేసింది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని హెచ్చరిస్తోంది థాయ్‌ల్యాండ్‌​ సీతమ్మ. ఇంతకు ఆమెలా అంతలా కోపం తెప్పించినా ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

ఈ సంఘటన ఉత్తర బ్యాంకాక్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లో సదరు మహిళ నివసిస్తూ ఉండేది. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌లో ఓ చోట రిపేర్‌ రావడంతో ఇద్దరు పెయింటర్లు 26వ అంతస్తుకు వెళ్లి.. బాగు చేయడం ప్రారంభించారు.
(చదవండి: Viral: అనుకోని అతిథి.. మామూలు నష్టం కాదు)

అయతే తనను అడగకుండా ఎలా వెళ్తారని ఆగ్రహించిన మహిళ సదరు పెయింటర్స్‌కు మద్దతు కోసం ఏర్పాటు చేసిన తాడును కత్తిరించింది. అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోవడం పెయింటర్ల వంతయ్యింది. పాపం వారిద్దరు 26వ అంతస్తు నుంచి గాల్లో వేలాడసాగారు. సహాయక సిబ్బంది వచ్చి.. వారిని కాపాడేవరకు గాల్లోనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది. 
(చదవండి: కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా )

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సదరు మహిళను అరెస్ట్‌ చేశారు. అయితే తాను పెయింటర్లను చంపాలనుకోలేదని.. తన అనుమతి లేకుండా బిల్డింగ్‌కు మీదకు ఎక్కడంతో కోపం వచ్చి.. తాడు కట్‌ చేశానని తెలిపింది. ఏది ఏమైనా సదరు మహిళ చేసిన పని హత్యాయత్నం కిందకే వస్తుందని చెప్పి.. ఆమె మీద కేసు నమోదు చేశారు. కోర్టు ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కొన్ని నిమిషాల పాటు సహనంగా ఉంటే.. ఇంత ప్రమాదం జరిగేది కాదు కదా అంటున్నారు విషయం తెలిసిన నెటిజనులు. 

చదవండి: కాలికి తగిలిన అదృష్టం.. ఏకంగా రూ.1.8 కోట్లు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top