కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా | Viral Video of Toddler Adjusting Her Crown on Ramp Like A Boss | Sakshi
Sakshi News home page

కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా

Oct 27 2021 7:47 PM | Updated on Oct 27 2021 7:51 PM

Viral Video of Toddler Adjusting Her Crown on Ramp Like A Boss - Sakshi

చిన్నారి స్థానంలో పెద్దవారు ఉన్నప్పటికి కూడా జరిగిన సంఘటనతో వారు చాలా సిగ్గుపడేవారు. భయపడుతూ.. అక్కడ నుంచి పరిగెత్తే వారు

పిల్లలకు బాల్యం నుంచే సమయస్ఫూర్తి.. పరిస్థితులను ఎదుర్కొని నిలబడే తెగువ, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను అలవాటు చేయాలి. ప్రతి చిన్న విషయానికి కుంగిపోవడం, బెంబేలెత్తడం చేస్తూంటే.. జీవితంలో ముందుకెళ్లడం కష్టమని బాల్యం నుంచే అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకంటే పట్టుమని ఐదేళ్ల వయసు కూడా లేని ఓ చిన్నారి స్టేజీ మీద చూపిన అద్భుత సమసయస్ఫూర్తి, ఆత్మ విశ్వాసం.. నెటిజనలను ఫిదా చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. 

ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందనే వివరాలు తెలియదు. ఇక వీడియోలో ఓ బాబు, పాప ఇద్దరు ర్యాంప్‌ వాక్‌ చేస్తుంటారు. తెల్ల దుస్తుల్లో ఎంతో క్యూట్‌గా ఉంటారు చిన్నారులు. అలా వాక్‌ చేస్తుండగా ఉన్నట్టుండి పాప చెప్పు ఉడిపోతుంది. దాన్ని సరిచేసుకుంటుండగా.. తల మీద ఉన్న కిరీటం కూడా జారిపోతుంది. ఈ సంఘటన చూసి అక్కడున్న పెద్దలంతా ఒక్కసారిగా నవ్వుతారు. కూడా ఉన్న పిల్లాడు నవ్వుతాడు.
(చదవండి: మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్‌)

ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. ఇంత జరిగినా ఆ చిన్నారి ఏ మాత్రం బెదరదు.. సిగ్గుపడదు. వెంటనే తన కిరీటాన్ని సరిచేసుకోవడమే కాక చెప్పు తొడుక్కుని ర్యాంప్‌ వాక్‌ పూర్తి చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.
(చదవండి: హైదరాబాద్‌ మెట్రో: ఇంత దారుణమా.. మనుషులమేనా?!)

ఇది చూసిన నెటిజనులు.. ‘‘చిన్నారి స్థానంలో పెద్దవారు ఉన్నప్పటికి కూడా జరిగిన సంఘటనతో వారు చాలా సిగ్గుపడేవారు. భయపడుతూ.. అక్కడ నుంచి పరిగెత్తే వారు. కానీ ఈ చిన్నారి ఎంతో ఆ‍త్మవిశ్వాసంతో.. ఏమాత్రం తడబడకుండా.. పరిస్థితిని చక్కదిద్దుకుని ముందుకు సాగింది. చాలా స్ట్రాంగ్‌గా నిలబడింది. భవిష్యత్తులో కూడా ఈ చిన్నారి ఇలానే పరిస్థితులకు తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

చదవండి: ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement