దాడులను సహించం!... పాక్‌కి వార్నింగ్‌

Taliban Administration Would Not Tolerate Pak Airstrikes - Sakshi

Taliban administration blamed Pakistan for airstrikes: అఫ్గనిస్తాన్‌ రాజధాని కాబోల్‌ని కునార్‌, ఖోస్ట్‌ ప్రావిన్స్‌లలో వరుస వైమానిక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అఫ్గాన్ ఈ దాడులను పాకిస్తాన్‌ నిర్వహించిందని సంచలన ఆరోపణలు చేసింది కూడా. పైగా తాము ఈ దాడులను సహించమని తాలిబన్లు హెచ్చరించారు. అయితే పాక్‌ మాత్రం అఫ్గనిస్తాన్‌ సరిహద్దులో జరిగిన వైమానిక దాడుల్లో తమ ప్రమేయం లేదని ధృవీకరించకపోవడం గమనార్హం. ఈ మేరకు అఫ్గనిస్తాన్‌ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మహ్మద్ యాకూబ్ మాట్లాడుతూ...మేము ప్రపంచం, పోరుగు దేశాల నుంచి చాలా రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నాం.

ఇందుకు మా సరిహద్దు భూభాగాల్లో జరిగిన వైమానిక దాడులే ఒక ఉదాహరణ. కానీ పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ రెండు సోదర దేశాలు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మేమే ఈ దాడులన సహించాం. మరోసారి ఈ దాడులు జరిగితే సహించేది లేదు అని నొక్కి చెప్పారు. అంతేకాదు ఈ రెండు దేశాలు తీవ్రవాదాన్ని వ‍్యతిరేకించేవే కానీ గత కొంతకాలంగా తీవ్రవాదానికి సంబంధించిన దేశాలు అనే కళంకంతో బాధపడుతున్నాయని అన్నారు.

సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ఆయా గడ్డలలో ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవడంలోనూ ఇరు దేశాలకు సంబం‍ధించిన అధికారులు సహకరించాలని చెప్పారు. ఈ దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తాలిబాన్ పరిపాలన విదేశాంగ శాఖ గత వారం పాకిస్తాన్‌న్ రాయబారిని పిలిచింది కూడా. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 36 మంది మరణించారని అఫ్గాన్‌ స్థానిక అధికారులు తెలిపారు. అంతేకాదు ఏప్రిల్ 16న ఖోస్ట్, కునార్‌ ప్రావీన్సులలో జరిగిన వైమానిక దాడుల్లో 20 మంది పిల్లలు మరణించారని ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి పిల్లల ఏజెన్సీ హెడ్ పేర్కొన్నారు.

(చదవండి: ఉక్రెయిన్‌ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top