ఈ నేరగాళ్లను గుర్తుంచుకోండి | Remember these criminals: Iran names US officers behind deadly Minab school strike | Sakshi
Sakshi News home page

ఈ నేరగాళ్లను గుర్తుంచుకోండి

Mar 30 2026 5:27 AM | Updated on Mar 30 2026 5:27 AM

Remember these criminals: Iran names US officers behind deadly Minab school strike

మినాబ్‌లో పాఠశాలపై దారుణదాడులకు పాల్పడింది వీళ్లే

అమెరికా నావికాదళాధికారుల ఫొటోలను విడుదలచేసిన ఇరాన్‌ 

టెహ్రాన్‌: అమెరికా దాడుల్లో ఓ ప్రాథమిక పాఠశాలలో 168 చిన్నారుల మరణాలకు కారకులైన ఆ దేశ అధికారుల ఫొటోలను ఇరాన్‌ ఆదివారం విడుదలచేసింది. ‘‘ఈ నేరగాళ్లను గుర్తించుకోండి. వీరి పేర్లు యూఎస్‌ఎస్‌ స్ప్రుయన్స్‌ యుద్ధనౌక కమాండర్‌ లీగ్‌ ఆర్‌ టేట్, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జెఫ్రీ ఇ.యార్క్‌. పాఠశాలపై తోమహాక్‌ క్షిపణులు  ప్రయోగానికి ఆదేశాలిచ్చింది వీళ్లే’’ అంటూ భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఆదివారం ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. ‘‘ఇంతటి దారుణానికి పాల్పడ్డాక కూడా వాళ్లు ప్రశాంతంగా ఎలా నిద్రపోయారో.

బాధితుల కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం వారికుందా?’’ అని నైజీరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ప్రశ్నించింది. మినాబ్‌లోని షజారాహ్‌ తయ్యబే స్కూల్‌పై జరిగిన ఆ దాడితో తమకు సంబంధం లేదని అమెరికా బుకాయించినా తర్వాత తన తప్పిదాన్ని ఒప్పుకుంది. ‘‘ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) స్థావరంపై దాడి చేయాలనుకున్నాం. కాలం చెల్లిన నిఘా మ్యాప్‌ల వల్ల పాఠశాల భవనాన్ని సైనిక స్థావరంగా భావించి పొరపాటున బాంబులేశాం’’ అంటూ తీరిగ్గా చింతించింది!

Advertisement
 
Advertisement
Advertisement