మంకీపాక్స్‌ వద్దు.. మరో పేరు పెట్టండి! డబ్ల్యూహెచ్‌వోకు లేఖ

Remane Monkeypox Over Stigmatising Issue Requests Pour To WHO - Sakshi

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్త వైరస్‌ ఎఫెక్ట్‌తో చాలా దేశాలు అప్రమత్తం అయ్యాయి కూడా. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ..  వారాంతంలో ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే పలు దేశాలు ఎయిర్‌పోర్ట్‌లలో టెస్టులు, లక్షణాలు కనిపిస్తే చికిత్స.. ట్రేసింగ్‌ చేపడుతున్నాయి. ఈ దరిమిలా డబ్ల్యూహెచ్‌వోకు ఓ అరుదైన విజ్ఞప్తి వచ్చింది. 

మంకీపాక్స్‌ వైరస్‌ పేరును అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉందని WHOకి విజ్ఞప్తులు అందుతున్నాయి. మంకీపాక్స్‌ అనే పేరునే ట్రీట్‌మెంట్‌లో ఉన్న రోగులు ఓ కళంకంగా భావించే అవకాశం ఉంది. పైగా ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రజలు జాతివివక్షగా భావించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి, వైరస్‌ పేరు మంకీపాక్స్‌ నుంచి మరోలా మార్చాలని ప్రపంచ ఆర్గోగ్య సంస్థకు న్యూయార్క్‌ సిటీ పబ్లిక్‌ హెల్త్‌ కమిషనర్‌ అశ్విన్‌ వాసన్‌ ఓ లేఖలో కోరారు.   

‘‘బాధాకరమైన, జాత్యహంకార చరిత్రలో మంకీపాక్స్ వంటి పదజాలం రంగుల సంఘాల కోసం పాతుకుపోయింది’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రైమేట్స్‌ నుంచే మంకీపాక్స్‌ అనే పదం పుట్టలేదని, గతంలో కోవిడ్‌-19ను చైనీస్‌ వైరస్‌గా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తావించడం దుమారం రేపిన సంగతిని సైతం ఆయన లేఖలో ప్రస్తావించారు. 

మంకీపాక్స్‌ అనేది ఎవరికైనా సోకుతుందని, అయతే రేసిజం, ఎల్జీబీటీక్యూ(లైంగిక ధోరణి)తోనూ వైరస్‌ వ్యాప్తి చెందుతోందన్న వాదన సైతం.. చికిత్సలకు అవాంతరంగా మారొచ్చని అశ్విన్‌ వాసన్‌ నొక్కి చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో 16వేలకు పైగా మంకీపాక్స్‌ కేసులు నిర్దారణ అయ్యాయి.

చదవండి:  కరోనా-మంకీపాక్స్‌ తేడాలు ఏంటో తెలుసా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top