కేప్‌టౌన్ : పొప్ లియో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు చేయడానికి బిలియన్లు ఖర్చు చేసి కొద్ది మంది నియంతల వల్ల ప్రపంచ తీవ్ర వినాశనానికి గురవుతుందన్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తిక్కరేస్తే అంతే సంగతులు. ఏవరికైనా వార్నింగ్ ఇస్తారు. ఈ దేశంపైనైనా దాడికి తెగబడతారు. ఇటీవల ఆ జాబితాలో పోప్ లియో-14 చేరారు. ఆయన బలహీన పోప్ అని అతనికి ఆ పదవి తన వల్లే వచ్చిందన్నారు. ఆయన విదేశాంగ విధానం చాలా దారుణమని మితిమీరిన ఉదారవాదం కనబరుస్తున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షున్నే విమర్శించే పోప్ తమ దేశానికి వద్దని విరుచుకపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలకు పోప్ సైతం ఎక్కడా తగ్గకుండా సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న పోప్ మీడియాలో ఇలా మాట్లాడారు " యుద్ధాలు చేయడానికి బిలియనల్ కొద్ది డబ్బు ఖర్చు చేసే వారి వల్ల ప్రపంచం నాశనమవుతోంది.అంతేకాకుండా తమ స్వార్థపు లక్షాలను సాధించడానికి వీరు భగవంతుని పేరు వాడుకోవడం చాలా బాధకరమన్నారు. విధ్వంసం కోసం బిలియన్లు ఖర్చు చేసే వారు విద్య, పునరావాసంపై దృష్టిసారించరు. దేనినైనా నాశనం చేయడానికి ఒక్క క్షణం చాలు. కానీ సరిచేయడానికి ఒక జీవితకాలం కావాలి" అన్నారు. అయితే పోప్ పర్యటనకు అక్కడ విశేష స్పందన లభించింది. బబెండా నగరంలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ఇస్లామిక్, క్రైస్తవ మత నాయకులతో పోప్ లియో ఒక శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


