దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్‌ అయ్యింది!.పాపం ఆ ప్రయాణికుడు..

Passenger Accidentally Locked Flight US Pilot Climbs Cockpit Window - Sakshi

విమానం గమ్యస్థానానికి చేరకోగానే ప్రయాణికులు దిగిపోవడం సర్వసాధారణం. ఐతే ఓ విమానంలో చివరిగా దిగుతున్న ప్రయాణికుడు దిగే సమయంలో సడెన్‌గా డోర్లు లాకయ్యాయి. ఆ విమానం తిరిగి మరో జర్నీకి రెడీ అవతుండగా అసలు విషయం బయట పడింది. పాపం ఆ ప్రయాణికుడుని బయటకు తీసుకొచ్చేందుకు పైలట్‌ కాక్‌పీట్‌ విండో గుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ అరుదైన ఘటన అమెరికాలోని శాన్‌ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..శాన్‌ డియాగో అంతర్జాతీయ విమానాశయంలో శాక్రమెంటోకు వెళ్లే సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు అనుకోకుండా ఇరుక్కుపోయాడు. నిజానికి సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ శాన్‌ డియాగో విమానాశ్రయం చేరుకోగానే ప్రయాణికులంతా దిగిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో  బోర్డింగ్‌ ప్రక్రియలో ఇతర ప్రయాణికులు, ఫ్లైట్‌ అటెండెంట్‌లు ఆన్‌బోర్డ్‌లో ఉండగా.. చివరగా దిగుతున్న ప్రయాణికుడు ఫార్వార్డ్‌ లావేటరీ డోర్‌ని తెరిచాడు. అంతే  ఒక్కసారిగా విమానం డోర్‌ లాక్‌ అయ్యిపోయింది. దీంతో ఆప్రయాణికుడు ఆ విమానంలో అలానే ఉండిపోయాడు.

ఇంతలో మరో ట్రిప్‌కి విమానం సిద్దమయ్యే నిమిత్తం పైలట్లు ఆ విమానాన్ని ఆపరేట్‌ చేసేందుకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పైలట్‌ డెక్‌ కాక్‌పీట్‌ వద్ద ఉండే విండో గుండా వెళ్లి ఆ ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చాడు. ఆ ప్రయాణికుడు ఒక్కడే ఆ విమానం నుంచి చివరిగా బయటకు వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోను అదే విమానంలో ప్రయాణించేందుకు వెళ్తున్న రెక్స్‌ రోడ్‌ అనే మరో ప్రయాణికుడు ఆ దృశ్యాలను నెట్టింట షేర్‌ చేయడంతో ఈ విషమం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ అనుహ్య ఘటనతో తాము తొమ్మది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరినట్లు తెలిపాడు. ప్రతిస్పందనగా సదరు ఎయిర్‌లైన్స్‌ ట్విట్టర్‌లో మీరు ఎప్పుడూ చూడని అరుదైన దృశ్యం అని పేర్కొంది.

(చదవండి: తొలిసారిగా సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనున్న చైనా!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top