4 Passengers Arrested After In-Flight Fighting That Caused An Emergency Landing - Sakshi
Sakshi News home page

Viral Video: అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..నలుగురు ప్రయాణికులు అరెస్టు

Apr 26 2023 9:17 AM | Updated on Apr 26 2023 11:21 AM

4 Passengers Arrested After Fight In Flight Prompted Emergency Landing - Sakshi

విమానం కిటికి అద్దం పగిలిపోయేలా ప్రయాణికులు రగడ.

ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూశాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన కెయిర్న్స్‌ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే..ఏప్రిల్‌ 20న కెయిర్న్స్‌ నుంచి నార్తర్న్‌ టెరిటరీ ఆఫ్‌ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మద్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్నది విమానం అన్న స్ప్రుహ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోని 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా.. విమానంలోని ఫర్నిచర్‌ డ్యామేజ్‌ అయ్యేలా పోట్లాడుకున్నారు.

విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్‌ల్యాండ్స్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసేందుకు దారి మళ్లించాల్సి వచ్చింది. చివరికి విమానం టేకాఫ్‌ అయినప్పుడూ కూడా ఆ గుంపు ఏ మాత్ర తగ్గలేదు. మరోసారి గొడవపడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికి అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సముహన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో)​​​​​​​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement