ప్రెస్‌మీట్‌లో పాక్‌ జర్నలిస్టుల బూతులు.. వీడియో వైరల్‌ | Pakistani journalists clash at London cafe viral clip | Sakshi
Sakshi News home page

ప్రెస్‌మీట్‌లో పాక్‌ జర్నలిస్టుల బూతులు.. వీడియో వైరల్‌

May 5 2025 7:21 AM | Updated on May 5 2025 8:47 AM

Pakistani journalists clash at London cafe viral clip

లండన్‌: పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులు దారుణంగా ప్రవర్తించారు. విదేశాల్లో మీడియా సమావేశానికి హాజరైన ఇద్దరు పాక్‌ జర్నలిస్టులు మాత్రం.. పరస్పరం తిట్టుకుంటూ ఏకంగా బూతుపురాణం అందుకున్నారు. పాక్‌ నేత ప్రెస్‌మీట్‌ సందర్భంగా జరిగిన గొడవ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. పాక్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ సెక్రెటరీ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన సల్మాన్‌ అక్రమ్‌ రాజా లండన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సఫీనా ఖాన్‌, అసద్‌ మాలిక్‌తోపాటు పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. సఫీనా ఖాన్‌ పాకిస్థాన్‌కు చెందిన నియో న్యూస్‌ ఛానెల్‌లో పని చేస్తుండగా.. అసద్‌ మాలిక్‌, కొందరు ఇతర జర్నలిస్టులు వేర్వేరు చానళ్లలో పని చేస్తున్నారు. వీరంతా ఒక చోట చేరిన సమయంలో సఫీనా, అసద్‌ మాలిక్‌ మధ్య వివాదం చోటు చేసుకుంది.

ఇద్దరు గొడవకు దిగారు. బూతులు తిట్టుకున్నారు. కుటుంబాలను సైతం దూషించుకున్నారు. అక్కడున్న మిగతా జర్నలిస్టులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం మాలిక్, ఇతర పాక్‌ జర్నలిస్టులు తనను చంపేస్తామని బెదిరించారని సఫీనా ఖాన్‌ ట్వీట్‌ చేశారు. తనకు ఏదైనా జరిగితే ఈ ముగ్గురు రిపోర్టర్లే బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. ఆరోపణలను అసద్‌ఖాన్‌ తోసిపుచ్చారు. ఇద్దరు జర్నలిస్టుల మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement