చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్‌

Rahul Gandhi In London Jaishankar Doesn't Understand China Threat - Sakshi

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌కి చైనా బెదిరింపు అస్సలు అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మళ్లీ చైనాను ఆక్రమించుకోమని ఆహ్వానిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు లండన్‌లో ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో జరిగిన సంభాషణలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్‌ రష్యా యుద్ధంలో భారత్‌ ఎలాంటి వైఖరి తీసుకోలేదు కాబట్టి పాక్‌ లేక చైనాలు భారత్‌ని ఆక్రమించేందుకు యుద్ధానికి దిగితే ప్రపంచం విస్మరించే అవకాశం ఉంది కదా అని విలేకరులు ప్రశ్నించగా.. దీనికి రాహుల్‌ స్పందిస్తూ.. మేము ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాం అన్నారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) చేతిలో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్లకు వరకు మా భూభాగం ఉందని చెప్పారు. కానీ ప్రధాని మోదీ మాత్రం స్వయంగా ఎవరూ ప్రవేశించలేదని ప్రకటించడం విశేషం. పైగా ఈ విషయం గురించి చర్చిస్తుంటే ఏమిటి రచ్చ అని ప్రశ్నిస్తున్నారన్నారు.

ప్రస్తుతం చైనా విషయంలో భారత్‌ కాస్త జాగ్రత్తాగా ఉండాల్సిందే కదా అని మరో ప్రశ్న సంధించగా.. చైనా నుంచి ముప్పు ఉందనే తాను పదేపదే ప్రభుత్వానికి చెబుతున్నానన్నారు రాహుల్‌. భారత భూభాగంలోకి ఎవర్నీ ప్రవేశించకుండా చేయడం కాంగ్రెస్‌ విధానమని నొక్కి చెప్పారు. చైనా విషయలో కాంగ్రెస్‌ పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. భూభాగంలోకి ప్రవేశించి, చుట్టుముట్టడం, బెదిరించడం వంటి వాటికి కాంగ్రెస్‌ అస్సలు అంగీకరించదన్నారు.

మిలటరీ బెదిరింపులు గురించి విలేకరులు  అడిగనప్పుడూ..రాహుల్‌ మాట్లాడుతూ.. బెదిరింపులు గురించి అర్థం చేసుకోవాలి, రానున్న ముప్పు గురించి స్పందిచాలి. విదేశాంగ మంత్రి జైశంకర్‌కి చైనా నుంచి ఉన్న అసలు ముప్పు ఏమిటో అర్థం కావడం లేదు. బహుశా ప్రధాని ఎవరూ ప్రవేశించలేదని ప్రకటించడం వల్ల ఆయనకు వాస్తవం ఏమిటో అర్థం కావటం లేదని రాహుల్‌ జర్నలిస్ట్‌ల సంభాషణలో​ చెప్పారు. కాగా, ఎస్ జైశంకర్ ఏఎన్‌ఏ మీడియా సమావేశంలో రాహుల్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ..సైన్యాన్ని వాస్తవ నియంత్రణ రేఖకు పంపింది కాంగ్రెస్ నాయకుడు కాదని, ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. 1962లో ఏమి జరిగిందో ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాలంటూ ధీటుగా కౌంటరిచ్చారు. అసలు ఆ భూభాగం చైనాలో కంట్రోల్‌లోకి 1962లో వెళ్లిపోతే 2023లోని మోదీ ప్రుభుత్వంపై నిందాలా? అని మండిపడ్డారు జైశంకర్‌

(చదవండి: మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top