పాక్‌కు షాక్‌.. ఇస్లామాబాద్ వచ్చేది లేదు: ఇరాన్‌ | pakistan led ceasefire efforts collapse | Sakshi
Sakshi News home page

పాక్‌కు షాక్‌.. ఇస్లామాబాద్ వచ్చేది లేదు: ఇరాన్‌

Apr 4 2026 12:58 AM | Updated on Apr 4 2026 9:06 AM

pakistan led ceasefire efforts collapse

ఇరాన్‌ యుద్ధం ముగింపు కోసం పాకిస్థాన్‌ చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. అమెరికా పెట్టిన డిమాండ్స్‌ ఎ‍ట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ఇరాన్ తేల్చిచెప్పింది. దీంతో ఇస్లామాబాద్‌లో జరిగే చర్చలకు తమ దేశ ప్రతినిధులను పంపేప్రసక్తే లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది.

పశ్చిమాసియా యుద్దం మెుదలై నెలరోజులు గడుస్తోన్నా పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగడం లేదు కదా మరింత దురుతున్నాయి. ఇంతకాలం పాటు చర్చలు జరుగుతన్నాయని ప్రచారం జరిగినా వాటిపైనా ఎవరికీ పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అసలు చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదంటూ ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.

వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. యుద్ధ విరమణకు ట్రంప్ పెట్టిన నిబంధనలు ఏ మాత్రం అంగీకారం లేవని ఇరాన్ పేర్కొన్నట్లు తెలిపింది. దీంతో సీజ్‌ ఫైర్‌ ఒప్పందం కోసం ఇస్లామాబాద్‌లో నిర్వహిస్తున్న చర్చలకు ఎట్టిపరిస్థితుల్లో తమ దేశ ప్రతినిధులను పంపేది లేదని తెలిపింది. ఈ ప్రకటనతో యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది.

కాగా ఇరాన్ తన ఆధీనంలోని హార్ముాజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే యుద్ధ విరమణకు అంగీకరిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. .. "హార్ముాజ్ జలసంధిని పూర్తిగా స్వేచ్ఛగా తెరిచే వరకు ఇరాన్‌ను రాతి యుగం నాటి పరిస్థితికి వెళ్లేలా బాంబులతో ధ్వంసం చేస్తూనే ఉంటాం" అని సోషల్ మీడియాలో ఇరాన్‌ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ సైతం వెనక్కి తగ్గట్లేదు

కాగా  పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇప్పుడు టర్కీ మరియు ఈజిప్ట్ దేశాలు ఈ చర్చల కోసం మరో వేదికల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement