Imran Khan PTI Party: పాకిస్తాన్‌లో సంచలనం.. ఇమ్రాన్‌కు ఊహించని షాక్‌!

Pakistan Government Considering Banning Imran Khan Party PTI - Sakshi

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో మరోసారి పొలిటికల్‌ వాతావరణం హీటెక్కింది. పాక్‌ ప్ర‌భుత్వంపై మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ నిర‌స‌న గ‌ళం విప్పుతుండ‌గా, ఇందుకు ప్ర‌తిగా ప్ర‌భుత్వం కూడా ఇమ్రాన్‌ను టార్గెట్‌ చేసింది. ఈ పరిస్థితులు నేప‌ధ్యంలో పాక్‌ ప్రభుత్వం ఇమ్రాన్‌ ఊహించని విధంగా దెబ్బకొట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇమ్రాన్‌ పొలిటికల్‌ పార్టీ త‌హ‌రీక్‌-ఏ-ఇన్సాఫ్‌(పీటీఐ)పై బ్యాన్ విధించాల‌ని ప్ర‌భుత్వం రంగం సిద్దం చేసింది. ఈ విష‌యాన్ని పాక్ రక్ష‌ణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.

వివరాల ప్రకారం.. ఖవాజా ఆసీఫ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఇమ్రాన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు దేశంలో విధ్వంసం సృష్టించడమే కాక, దేశ మిలటరీ స్థావరాలపై దాడులకు తెగబడిన నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. పీటీఐని నిషేధించాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే దీనిపై సమీక్ష జరుగుతున్నదన్నారు. ఇప్పటికే పార్లమెంట్‌ ఆమోదం కోసం పంపామని, అనంతరం పీటీఐ నిషేధంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ త‌ర‌చూ దేశ రక్ష‌ణశాఖ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, దేశ సైన్య విభాగాన్ని శ‌త్రువుగా భావిస్తున్నార‌ని ఆరోపించారు. పాక్ సైన్యం కార‌ణంగానే ఇమ్రాన్ రాజ‌కీయాల్లో కాలుమోపార‌ని, ఇప్పుడు దీనిని మ‌ర‌చిపోయి ఆయ‌న సైన్యాన్ని త‌ప్పుప‌ట్ట‌డం స‌రికాద‌న్నారు. 

కాగా, మే 9న పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంత‌రం దేశ‌వ్యాప్తంగా ప‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, ఆందోళ‌న‌లు చోటుచేసుకున్నాయి. పీటీఐ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, మ‌ద్ద‌తుదారులు సైనికాధికారుల‌ ముఖ్యకార్యాల‌యంపై దాడులు చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఇక,  ప‌లు అవినీతి ఆరోప‌ణ‌ల‌తో మే 9న పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసిన అనంత‌రం దేశంలో రాజ‌కీయ అస్థిర‌త త‌లెత్తింది. 

ఇది కూడా చదవండి: మరో మహమ్మారి పొంచి ఉంది.. WHO వార్నింగ్‌ ఇదే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top