ఆరేళ్ల క్రితం ఇల్లు లేదు... ఇప్పుడు మిలియనీర్‌

Once-homeless California woman wins 5 million dollers from lottery - Sakshi

కాలిఫోర్నియా: ఆరేళ్ల క్రితం నిలువ నీడలేని అమెరికన్‌ మహిళ నక్కతోక తొక్కారు. అదృష్టం లాటరీ రూపంలో తలుపు తట్టి రాత్రికి రాత్రి కోట్లకు పడగలెత్తారు. లాటరీలో 50 లక్షల డాలర్లు గెలుచుకున్నానని తెలియగానే ఆమె మొదట నమ్మలేదు. అది నిజమేనని అర్థమయ్యాక ఆమె ఆనందానికి అంతేలేదు.

కాలిఫోర్నియాకు చెందిన లూసియా ఫోర్‌సెథ్‌ను చాలా కాలంగా ఆర్థిక కష్టాలు వేధిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం ఇల్లు కూడా లేదు. కష్టపడి చదివి డిగ్రీ సంపాదించారు. చిన్న ఉద్యోగం వచ్చింది. కారులో ఆయిల్‌ కొట్టించినప్పుడు చిల్లర లేక అయిష్టంగానే లాటరీ టిక్కెట్‌ తీసుకున్నారు. దాంతోనే ఆమె ఇంట డాలర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది లూసియా పెళ్లి చేసుకోనున్నారు. జీవిత భాగస్వామితో పాటు ఈ లాటరీ టిక్కెట్‌ తన జీవితాన్నే మార్చేసిందని సంబరపడుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top