జీరో కోవిడ్‌ వ్యూహం తెచ్చిన తంటా...

Mass Testing Appears Set To Stay More Medical Wastage In China - Sakshi

Covid Mass Testing Mantra: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న చైనా కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే జీరో కోవిడ్‌ పాలసీని అనుసరించాల్సిందే అంటూ ప్రజలపై కఠినతర ఆంక్షలు విధించి నిర్బంధించింది. ఓ పక్క చైనా జీరో కోవిడ్‌ పాలసీ అట్టర్‌ ప్లాప్‌ అ‍య్యి కేసులు పెరిగిపోతున్నా చైనా అధికారులు మాత్రం జీరో కోవిడ్ వ్యూహం అంటూ పట్టుకుని వేళాడారు. ప్రపంచ దేశాలన్ని విమర్శిస్తున్న తన మాటే శాసనం అంటూ మూర్ఖంగా వ్యవహారించింది చైనా.

ఈ జీరో కోవిడ్‌ పాలసీ పేరుతో చైనా ప్రజలందరికి పెద్ద ఎత్తున మాస్‌ కరోనా టెస్ట్‌లు నిర్వహించింది. దీంతో ఇప్పుడూ చైనాలో పెద్ద కొండలా వైద్య వ్యర్థాలు పేరుకుపోయాయి. ప్రస్తుతం చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘై, షెన్‌జెన్, టియాంజిన్‌లో ఇప్పుడు టెస్టింగ్ కియోస్క్‌ల వంటి వైద్య వ్యర్థాల నిలయంగా మారాయి. అదీగాక ఈ వ్యర్థాలను తొలగించాలంటే చైనా ప్రభుత్వం పై సుమారు పది బిలయన్ల డాలర్ల పైనే పెనుభారం పడుతుందని అధికారులు చెబుతున్నారు

అసలే వరుస లాక్‌డౌన్‌తో దారుణమైన స్థితిలో ఉ‍న్న చైనా ఆర్థిక పరిస్థితికి ఇదొక పెద్ద సవాలు అని అంటున్నారు. పైగా ఈ వైద్యవ్యర్థాలు తొలగించలేని విధంగా అసాధారణ రీతిలో పెరిగిపోతున్నాయని షాంఘైలోని న్యూయార్క్‌ పర్యావరణ నిపుణుడు యిఫీ లీ అన్నారు. అదీగాక చైనా 2060 నాటికల్లా కార్బన్‌ న్యూట్రల్‌గా మార్చాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడమే కాకుండా వాయు, జల కాలుష్యాన్ని సైతం అరికట్టే చర్యలు చేపట్టింది కూడా. కానీ ఇపుడూ ఈ కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన వైద్యవ్యర్థాలను చూస్తుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం అంటున్నారు చైనా అధికారులు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top