దక్షిణ మధ్య తుర్కియేలోని ఓ పాఠశాలలో ఒక విద్యార్థి కాల్పుల కలకలం సృష్టించాడు. దీంతో తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందగా, 13 మందికి గాయాలయ‍్యాయి. బుధవారం కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిల్పులు జరిపినట్లు గవర్నర్ ముకెర్రెం ఉన్న్లుయెర్ తెలిపారు. కాల్పులు చేసిన విద్యార్థి కూడా మృతి చెందాడు.
“తొమ్మిది మంది మృతి చెందడం విచారకరం… 13 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు, అందులో ముగ్గురి మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది” అని అంతర్గత మంత్రి ముస్తఫా చిఫ్ట్చి తెలిపారు.
కాల్పులు జరిపిన విద్యార్థి తన తండ్రికి చెందిన తుపాకులను ఉపయోగించినట్లు భావిస్తున్నామని ఉన్న్లుయెర్ తెలిపారు. అతని తండ్రి మాజీ పోలీసు అధికారి. ఆ విద్యార్థి ఆయుధాలను బ్యాక్‌ప్యాక్‌లో దాచుకుని, రెండు తరగతి గదుల్లోకి వెళ్లి కాల్పులు జరిపినట్లు తెలిపారు.
తుర్కియేలో రెండు రోజుల వ్యవధిలో రెండు పాఠశాలల్లో కాల్పులు జరగడం గమనార్హం. మంగళవారం దక్షిణ-తూర్పు సాన్‌లియుర్ఫా ప్రావిన్స్‌లోని ఒక పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఓ మాజీ విద్యార్థి కాల్పులు జరిపి 16 మందిని గాయపర్చి, ఆత్మహత్య చేసుకున్నాడు.


