అర్ధరాత్రి హైడ్రామా.. అమెరికా-ఇరాన్‌ చర్చలపై వీడిన ఉత్కంఠ | Iran Representatives Reached Islamabad For US Peace Talks | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి హైడ్రామా.. అమెరికా-ఇరాన్‌ చర్చలపై వీడిన ఉత్కంఠ

Apr 11 2026 6:49 AM | Updated on Apr 11 2026 8:45 AM

Iran Representatives Reached Islamabad For US Peace Talks

అమెరికా ఇరాన్‌ శాంతి చర్చలపై ఉత్కంఠ వీడింది. గత అర్ధరాత్రి దాటాక ఇరాన్‌ ప్రతినిధులు ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అంతకంటే ముందే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అక్కడికి చేరారు. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

రెండు వారాల యుద్ధ విరామం ప్రకటించినప్పటికీ.. అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్‌ మాత్రం లెబనాన్‌పై భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది మరణించారు. అయితే.. హెజ్‌బొల్లా సంస్థను తుడిచిపెట్టడమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్‌ ప్రకటించుకుంది. ఈ పరిణామంపై ఇరాన్‌ ఆగ్రహం.. అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించబోదని ఇజ్రాయెల్‌ సమర్థించుకుంది. ఈ విషయంలో అమెరికా సైతం ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. అయితే.. 

లెబనాన్‌పై దాడులు ఆగాల్సిందేనని.. లేదంటే తామూ కాల్పులకు దిగుతామని.. యుధ్ధ మళ్లీ మొదలవుతుందని హెచ్చరించింది ఇరాన్‌. ఈ విషయంలో ఏదీ తేల్చనిది తాము చర్చలకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ తరుణంలో చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే.. చివరకు మెట్టు దిగిన ఇరాన్‌ ప్రతినిధులు హాజరు కావడంతో చర్చలు ముందుకు సాగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement