‘ట్రంప్‌ రండి.. కూర్చొని మాట్లాడుకుందాం’ : ఇరాన్‌ అధ్యక్షుడు | Iran president pezeshkian says Iran seeking dialogue, not war | Sakshi
Sakshi News home page

‘ట్రంప్‌ రండి.. కూర్చొని మాట్లాడుకుందాం’ : ఇరాన్‌ అధ్యక్షుడు

Apr 15 2026 3:25 PM | Updated on Apr 15 2026 4:02 PM

Iran president pezeshkian says Iran seeking dialogue, not war

టెహ్రాన్‌: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాతో తమ దేశం యుద్ధాన్ని కాకుండా శాంతి చర్చలు కోరుకుంటుందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు.  ఇదే విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ న్యూస్‌ ఏజెన్సీ (ఐఆర్‌ఎన్‌ఏ)ధృవీకరించింది.

పశ్చిమాసియా యుద్ధం. ఆ యుద్ధం కారణంగా ఇరాన్‌కు వాటిల్లిన నష్టం, హర్మూజ్‌ జలసంధిని అమెరికా మూసివేత వంటి పరిణామాలు, పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్‌ల మధ్య జరిగిన చర్చలతో పాటు ఇతర అంశాలపై పెజెష్కియాన్‌ ఐఆర్‌ఎన్‌ఏతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా పెజెష్కియాన్‌  తమ దేశం యుద్ధాన్ని కాకుండా చర్చలను కోరుకుంటోందన్నారు. అయితే అమెరికా తన ఇష్టాన్ని మా రుద్దడానికి లేదంటే లొంగిపోయేలా చేసేందుకు అమెరికా చేస్తున్న ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందన్నారు. అదే సమయంలో ఇరాన్‌లో అపార ప్రాణ నష్టానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ సమాజం ఖండించాలని స్పష్టం చేశారు.  అంతర్జాతీయ చట్టం, మానవతా సూత్రాల ప్రకారం పౌరులను, ఉన్నత వర్గాలను, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం, అలాగే పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కీలక కేంద్రాలను ధ్వంసం చేయడాన్ని సమర్ధించకూడదని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement