యుద్ధం ఉద్రిక్తం.. అమెజాన్‌ సెంటర్‌పై ఇరాన్ దాడి? | Iran attacks Bahrain data center | Sakshi
Sakshi News home page

యుద్ధం ఉద్రిక్తం.. అమెజాన్‌ సెంటర్‌పై ఇరాన్ దాడి?

Apr 1 2026 11:56 PM | Updated on Apr 2 2026 5:06 AM

Iran attacks Bahrain data center

ఇరాన్ అన్నంత పని చేసింది. మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా లాంటి ఐటీ కంపెనీలపై దాడి చేస్తామని టెహ్రాన్‌ ఇదివరకే హెచ్చరించింది. తాజాగా బహ్రెయిన్‌లోని అమెజాన్‌ కంపెనీపై క్షిపణులతో విరుచుకపడ్డట్లు తెలుస్తోంది.  

కొద్దిసేపటి క్రితం బహ్రెయిన్‌లో అమెరికా కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు చెందిన డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం ఆ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. కాగా అంతకుముందు ఒక కంపెనీ భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పివేస్తున్నాయని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదించింది. కానీ మంటలు సంభవించిన ప్రాంతం వివరాలు మాత్రం పేర్కొనలేదు.

మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా సహా 18 అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మంగళవారం ప్రకటించింది.  ఇరాన్‌లో జరిగే ప్రతి ఉగ్రదాడికి బదులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది.

కాగా  మరోవైపు, ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి ఒప్పందం అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఈ యుద్ధాన్ని రెండు మూడు వారాల్లో ముగించగలదని పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది

Advertisement
 
Advertisement
Advertisement