
వాషింగ్టన్: కోవిడ్–19 చికిత్సకు ఉపయోగపడే ఓ మార్గాన్ని తెలంగాణకు చెందిన సైంటిస్ట్ డాక్టర్ తిరుమల దేవి కన్నెగంటి కనుగొన్నారు. ఈమె అమెరికాలోని సెయింట్ జూడ్ రీసెర్చ్ ఆస్పత్రిలో గత 13 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఈమె పరిశోధనకు సంబంధించిన వివరాలు సెల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కోవిడ్–19 సోకిన తర్వాత శరీరంలోని వివిధ అవయవాలు వైరస్ వల్ల దెబ్బ తింటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ అవయవాలను దెబ్బతీస్తున్న మూలాలపై ఆమె పరిశోధనలు చేశారు. (భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందా?)
ఇందులో ప్రత్యేకించి వైరస్ కారణంగా కొన్ని కణాలు మరణిస్తున్నాయని కనుగొన్నారు. ఈ కణాల మరణం వల్ల ఇతర అవయవాలు దెబ్బ తింటున్నాయని ఆమె గుర్తించారు. కణాల మరణానికి కారణమవుతున్న సైటోకైనిన్‌లను సైతం ఆమె గుర్తించగలిగారు. ఈ పరిశోధన వల్ల నిర్ణీత సమస్యకు కచ్చితమైన సమాధానం కనుగొనవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఇతర వ్యాధుల చికిత్సకూ ఈ పరిశోధన ఉపయోగపడుతుందన్నారు. (కరోనా టీకాపై భారత్ ఆశలు.. తేల్చేసిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్)