కరోనా బాధిత దేశాలకు ఐఎంఎఫ్‌ సాయం

IMF approves 650 billion dollers expansion to fight pandemic - Sakshi

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారితో పోరాడుతూ ఆర్థిక పరిస్థితి దిగజారిన దేశాలకు అండగా నిలవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం 650 బిలియన్‌ డాలర్లు(రూ.48.44 వేల కోట్లు) ఖర్చు చేసేందుకు ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఐఎంఎఫ్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద ఆర్థిక సాయం కానుందని సంస్థ ఎండీ క్రిస్టలినా జార్జివా శుక్రవారం చెప్పారు. ఐఎంఎఫ్‌ తాజా నిర్ణయాన్ని పలు అంతర్జాతీయ సంస్థలు స్వాగతించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే 200 బిలియన్‌ డాలర్ల సాయాన్ని పొందానికి అవకాశం ఉందని అమెరికాలోని జూబ్లీ యూఎస్‌ఏ నెట్‌వర్క్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ లికాంప్టీ చెప్పారు.  పేద దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు ఈ సాయం ఉపయోగపడుతుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top