లాటరీ విధానంలోనే హెచ్‌1బీ వీసా

H-1B policy to continue with lottery system till 2021 Dec 31 - Sakshi

ట్రంప్‌ కొత్త విధానాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసిన  బైడెన్‌ సర్కార్‌  

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి భారతీయులు సహా విదేశీయులకు వీలు కల్పించే హెచ్‌–1బీ వీసాల మంజూరు ప్రక్రియలో ట్రంప్‌ హయాంలో తీసుకువచ్చిన మార్పుల్ని బైడెన్‌ సర్కార్‌ వాయిదా వేసింది. ఈ ఏడాది కూడా సంప్రదాయ లాటరీ విధానం ద్వారా వీసాలు జారీ చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్‌ 31వరకు లాటరీ విధానమే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త వీసా విధానం ప్రకారం రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో మార్పులు చేర్పుల కోసం అధికారులకు మరింత సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది.

హెచ్‌–1బీ వీసా కింద అమెరికాలో పలు టెక్‌ కంపెనీలు భారత్, చైనా ఇతర దేశాల నుంచి వేలాది మందిని ఉద్యోగాల్లో తీసుకుంటూ ఉంటారు. ట్రంప్‌ అధికారంలో ఉండగా ఈ వీసాల జారీ ప్రక్రియలో çకంప్యూటరైజ్డ్‌ లాటరీకి స్వస్తి పలికి ప్రతిభ ఆధారిత విధానం తీసుకువచ్చారు. ఈ కొత్త విధానం మార్చి 9 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీని అమలుకు అవసరమైన రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులకు  మరింత సమయాన్ని ఇస్తూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ కొత్త విధానం అమలును మార్చి 9 నుంచి డిసెంబర్‌ 31కి వాయిదా వేసినట్టుగా ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ వివరించింది.  

ప్రతిభ ఆధారిత వీసాలు..!
వలసేతర వీసా అయిన హెచ్‌–1బీ కింద అమెరికా ఏటా 65 వేల వీసాలను మంజూరు చేస్తుంది. వర్సిటీల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులలో ఉన్నత స్థాయి విద్యనభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. ఈ వీసాలున్న విదేశీయులకు తక్కువవేతనం చెల్లిస్తూ పలు కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటూ ఉండడంతో అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న భావన నెలకొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top