దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం | 6.1 Magnitude Earthquake Strikes South Pacific Near Ring Of Fire, Experts Warn Of Possible Aftershocks | Sakshi
Sakshi News home page

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం

Mar 23 2026 7:15 AM | Updated on Mar 23 2026 10:03 AM

Earthquake of magnitude 6.1 rattles Pacific Ocean

క్యాన్‌బెర్రా: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం మార్చి 22, 2026న రాత్రి 8:57  సమయంలో నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. సముద్రంలోని  10 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది.

ఈ భూకంపం తక్కువ లోతులో సంభవించడం వల్ల అదే ప్రాంతంలో చిన్నచిన్న భూకంపాలు సంభవించే అవకాశం ఉంది.  ఇవి సాధారణంగా ప్రధాన భూకంపం కంటే తక్కువ తీవ్రత కలిగి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయని  నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

రింగ్ ఆఫ్ ఫైర్
పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న సర్కం-పసిఫిక్ సిస్మిక్ బెల్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద భూకంప ప్రాంతం. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. ప్రపంచంలోని 90శాతం భూకంపాలు ఈ ప్రాంతంలోనే సంభవిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement