ఐరాసలో ఈసారి ట్రంప్‌ ఒక్కరే

Donald Trump only world leader speaking in in UN General Assembly - Sakshi

న్యూయార్క్‌: సెప్టెంబర్‌ 22న జరగనున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమావేశానికి ట్రంప్‌ హాజరయ్యే అవకాశం ఉందని ఐరాసలో అమెరిగా రాయబారి కెల్లీ క్రాఫ్ట్‌ చెప్పారు. సాధారణంగా ఏటా జరిగే ఐరాస సర్వసభ్య సమావేశా నికి 193 దేశాల అధికారులు గానీ, విదేశాంగ మంత్రులు గానీ హాజర వుతుం టారు. కానీ, ఈ ఏడాది కోవిడ్‌ కారణంగా ఈ కార్యక్ర మాన్ని 75 ఏళ్ల ఐరాస చరిత్రలో మొదటిసారిగా వర్చువల్‌గా నిర్వహించను న్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ దేశాధినేతలు తమ సందేశాలను వీడియో రూపంలో ముందే చిత్రీకరించి ఐరాసకు అందించనుండగా స్వయంగా హాజరై ప్రసంగించే నేత ట్రంప్‌ ఒక్కరేనని కెల్లీ తెలిపారు.

ఎన్నికల వాయిదాపై వెనక్కి తగ్గిన ట్రంప్‌
‘మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌’లో భారీగా అవకతవకలు జరిగే అవకాశం ఉన్నందున ఎన్నికలను వాయిదా వేస్తే మంచిదంటూ వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ వెనక్కి తగ్గారు. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నిక లు జరగాలని కోరుకుంటున్న ట్లు మీడియా తో అన్నారు. ‘ఎన్నికలు జరగాలి. అవి ఆలస్యం కావాలనుకోవడం లేదు. అప్పటి దాకా వేచి చూడటం, ఆతర్వాత బ్యాలెట్లు కనిపించకుండా పోవడం వంటివి జరగాలని కూడా కోరుకోవడం లేదు’అని వ్యాఖ్యానించారు.  ప్రధాన ప్రత్యర్ధి బిడెన్‌   ముందుకు దూసుకెళ్తుండటంతో ‘మెయిల్‌ ఇన్‌ ఓటిం గ్‌’లో అవకతవకలంటూ ఎన్నికలు వాయిదా పడేలా చేసేందుకు ట్రంప్‌ పథకం వేశారు. అయితే, సొంత పార్టీలోనే మద్దతు కరువవడంతో స్వరం మార్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top