
బీజింగ్: చైనా అధినేత షీ జిన్‌పింగ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో ప్రస్తుత పరిస్థితిని జిన్‌పింగ్‌కు పుతిన్ తెలియజేశారు. అలాగే రష్యా–అమెరికా మధ్య ఇటీవల జరుగుతున్న సంప్రదింపుల సారాంశాన్ని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పుతిన్ త్వరలో భేటీ కాబోతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన చైనా అధ్యక్షుడితో మాట్లాడడం విశేషం. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలని రష్యాపై ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు. ఇదిలా ఉండగా, పుతిన్, జిన్‌పింగ్‌ల మధ్య వ్యక్తిగతంగా స్నేహ సంబంధాలున్నాయి. 2013 నుంచి వారి బంధం కొనసాగుతోంది. అమెరికాతోపాటు యూరప్ దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ వ్యతిరేకంగా వారిద్దరూ చేతులు కలిపారు. త్వరలో చైనాలో జరిగే ఎస్సీఓ సదస్సుకు పుతిన్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.