చైనా తమ దేశంలోని పేదరికం గురించి బయటకు పొక్కనీయదు..ఆఖరికి ఆన్‌లైన్‌ వీడియోలను

China People Not Aware Of How Prevalent Poverty Is In The Country - Sakshi

ప్రతి దేశంలోనూ ఎంతో కొంత మేర పేదరికం కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల రీత్యా లేదా వాతావరణం లేదా మౌలిక వనరుల దృష్ట్యా పేదరికంలో ఉండటం జరుగుతుంది. కానీ చైనా తమ దేశంలో ఆ స్థితే తలెత్తదు అన్నట్టుగా వ్యవహిరిస్తుంది. అందుకు సంబంధించి చిన్న విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతోందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఆ క్రమంలో వాటికి సంబంధించిన ఆన్‌లైన్‌ వీడియోలను కూడా తొలగించి.. బ్యాన్‌ చేస్తోందని చెబుతోంది. అందుకు ఉదహారణగా చైనాలోని కొన్ని ఆన్‌లైన్‌ వీడియోల గురించి కూడా వెల్లడించింది న్యూయార్క్‌ టైమ్స్‌.

ఆయా వీడియోల్లో ఓ మహిళ ఇటీవలే తాను పదవీ విరణమ పొందానని, తన జీతం 100 యువాన్లని చెప్పింది. ఈ సొమ్ముతో ఎంత కిరాణ సామాగ్రిని కొనగోలు చేయవచ్చో చెప్పండి అని వాపోయింది. మరోక యువ గాయకుడు ఉద్యోగావకాశాల గురించి సోషల్‌ మీడియా వేదికగా నిరాసక్తతను వ్యక్తం చేశాడు. అలాగే ఒక వలస కార్మికుడు కరోనా సమయంలో తన కుటుంబాన్ని పోషించడానికి ఎలా కష్టపడ్డాడో వివరించాడు. దీంతో అతను విస్తృతమైన నెటిజన్ల సానుభూతిని పొందాడు. అంతే.. చైనా ఆయా వ్యక్తుల సోషల్‌ మీడియా ఖాతాలను మరుక్షణమే నిలిపేసింది. పైగా సదరు కార్మికుడు ఇంటికి ఎవరూ అప్రోచ్‌ కాకుండా ఉండేలా అధికారులు ఇంటి వద్దే మోహరించి ఉన్నారు. ఆఖరికి జర్నలిస్టులను కూడా రాకుండా అడ్డుకున్నారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే వీడియోలను, ఆర్థికపరిస్తితికి సంబంధించిన ఇలాంటి వీడియోలు లేదా పోస్టులు ప్రచురించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించింది చైనా సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌. ఇది వృద్ధులు, వికలాంగులు, పిల్లలకు సంబంధించిన విచారకరమైన వీడియోలను కూడా నిషేధిస్తుంది. చైనాకు సంబంధించినంత వరకు సానుకూల విషయాలనే ఉంచడానికే ప్రయారిటీ ఇస్తుంది. కేవలం చైనా కమ్యానిస్ట్‌ పార్టీ గత నాలుగు దశాబ్దాలుగా ఎంతమందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందనే దాని గురించే గొప్పగా చెప్పుకుంటుంది. కానీ మావో జెడాంగో హయాంలో మొత్తం దేశాన్ని ఎలా కడు పేదరికంలో నెట్టిందో ప్రస్తావించడానికి నిరాకరిస్తుంది చైనా.

నిజానికి చైనా చాలా సరిపడని సామాజికి భద్రతా వలయంలో చిక్కుకుంది. చైనా ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నప్పటికీ.. అక్కడి ప్రజలు చాలా మంది దారిద్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. అక్కడి ప్రజలు చాలా దయనీయమై పేదరికంలో బతుకుతున్నారు. ఒక పక్క దేశ ఆర్థిక పరిస్థితులు మసకబారుతుండటంతో ప్రజలు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐతే చైనా ప్రభుత్వం పేద ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితి గురించి చర్చించడాన్ని నిషేధించడమే గాక ప్రభుత్వం దృష్టిలో ఆ విషయమే ఒక నిషిద్ధ అంశంగా మారింది.

ఎంతలా అంటే.. చైనా దేశంలోని అతి పెద్ద వార్తా పోర్టల్‌ క్యూక్యూ డాట్‌ కామ్‌లో.. చైనీస్‌ పదం పిన్‌కున్‌(పేదరికం)ని సర్చ్‌ చేస్తే.. అమెరికా వంటి దేశాల్లో మరణాలు సంభవించడానికి నాల్గవ ప్రధాన కారణం పేదరికం అని చూపిస్తే, చైనాలోని పేదరికం సంబంధించిన వార్తలే అరుదుగా కనిపించడం గమనార్హం. చైనా తమ దేశంలోని పేదరికిం గురించి బయటపడకుండా ఉండేలా వాటికి సంబంధించిన ఆన్‌లైన్‌ వీడియోలన్నింటిని నిషేధించింది. దీంతో చైనాలో చాలామందికి తమ దేశంలో పేదరికిం ఎంత ‍ప్రబలంగా ఉందో తెలియదు. కాగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాత్రం 2021లో పేదరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఒక సమగ్ర విజయం సాధించాం అని ప్రకటించడం గమనార్హం.   

(చదవండి: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 9 మంది మృతి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top