చల్లారని తైవాన్‌–చైనా ఉద్రిక్తత

China continues military drills around Taiwan even after Pelosis visit end - Sakshi

బీజింగ్‌: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్‌ వైపు గుడ్లురిమి చూస్తున్న చైనా వారమైనా తన పంథాను మార్చుకోలేదు. తైవాన్‌ చుట్టూతా సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు కొనసాగిస్తూ ద్వీప ఆక్రమణ భయాలను పెంచేస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం ఆదివారమే ముగియాల్సిన సైనిక యుద్ధ క్రీడలను ఇంకా కొనసాగిస్తోంది.

తైవాన్‌ జలసంధి వెంట లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ పేరిట చైనా నావిక, వాయు సేన దళాలు సంయుక్త విన్యాసాలు కొనసాగిస్తున్నాయని చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. గత ఐదు రోజులుగా వేర్వేరు సామర్థ్యాలున్న క్షిపణులను చైనా ప్రయోగించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లను తీరం వెంట, గగనతలంలో చక్కర్లు కొట్టించింది. తైవాన్‌ స్పందనను చైనా విశ్లేషిస్తోందని జిన్‌హువా వార్తా సంస్థ తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top