పిల్లులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇల్లు, తిండి ఫ్రీ! | Cats Check Tickets in This Country | Sakshi
Sakshi News home page

Israel: పిల్లులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇల్లు, తిండి ఫ్రీ!

Published Wed, Apr 10 2024 12:09 PM | Last Updated on Wed, Apr 10 2024 12:09 PM

Cats Check Tickets in This Country - Sakshi

పిల్లులను చాలామంది ఎంతో ప్రేమగా పెంచుకుంటుంటారు. అయితే పిల్లులను ప్రభుత్వ విధుల్లో వినియోగించే దేశమొకటుందని మీకు తెలుసా? ఇంతకీ ఆ దేశంలో పిల్లులు ఏ పనులు చేస్తాయి? ఈ వివరాలు మీ కోసం..

పిల్లులను ప్రభుత్వ కార్యకాలాపాల్లో వినియోగించే దేశం ఇజ్రాయెల్‌.  ఇక్కడి రైల్వే స్టేషన్లలో పిల్లులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నాయి. ఇజ్రాయిల్‌లో పిల్లుల జనాభా 20 లక్షలకు పైగానే ఉంది. జనాభాలో మనుషులతో పోటీ పడుతున్న పిల్లులకు ఉపాధి కల్పించాలని అక్కడి ప్రభుత్వం భావించింది.  ఈ నేపధ్యంలో వాటిని రైల్వే స్టేషన్‌ విధులలో నియమించింది. ఈ పిల్లులు ప్రయాణికుల టిక్కెట్లను తనిఖీ చేస్తుంటాయి. 

మీడియా కథనాల ప్రకారం ప్రభుత్వం ఈ పిల్లులకు టిక్కెట్లను తనిఖీ చేయడంపై శిక్షణ ఇస్తుంది. ఎవరైనా టికెట్ చూపించడానికి ఇష్టపడకపోతే, ఆ పిల్లులు వారికి ఎదురుతిరుగుతాయి. ఈ పిల్లులకు ఆహారంతోపాటు అవి ఉండేందుకు ప్రత్యేక స్థలం కూడా కేటాయిస్తారు. రైల్వే స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఈ పిల్లులను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతుంటారు.

ఇజ్రాయెల్‌లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే అక్కడి ప్రభుత్వం పిల్లులను రైల్వేశాఖ విధుల్లో వినియోగిస్తోంది. దీనివలన ప్రభుత్వానికి కూడా  ఆర్థిక భారం తగ్గుతోంది. శిక్షణ పూర్తయిన పిల్లులను విధుల్లో నియమిస్తారు. ఈ పిల్లులకు టిక్కెట్‌ చూపకుండా ఏ ప్రయాణికుడు కూడా రైల్వే ప్లాట్‌ఫారందాటి బయటకు వెళ్లలేరని రైల్వే అధికారులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement