ఫ్రీగా వస్తోందని తప్పతాగి.. కుప్పకూలి మరణించాడు

British Tourist Dies After Being Given 22 Shots In 90 Minutes - Sakshi

క్లబ్‌లో ఫ్రీ ఎంట్రీ, ఉచితంగా లిక్కర్‌ బోర్డు కనిపించేసరికి అతని ప్రాణం ఆగమైంది. లోపలికి దూరిపోయి తాగడం మొదలుపెట్టాడు. అయితే మత్తులో అక్కడ జరుగుతోంది పెద్ద మోసమని అతనికి అర్థం కాలేదు. నాన్‌ స్టాప్‌గా అలా తాగుతూనే కుప్పకూలి.. మరణించాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అతని జేబులోంచి డబ్బును లాగేసుకుని.. శవాన్ని బయటకు విసిరిపారేసింది ఆ ముఠా. 

ఆరేళ్ల కిందట సంచలన సృష్టించిన బ్రిటిష్‌ టూరిస్ట్‌ హత్య కేసులో.. 58 మందిపై తాజాగా అభియోగాలు నమోదు చేశారు పోలాండ్‌ పోలీసులు. ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరాలు చేస్తున్న క్రమంలో.. సదరు టూరిస్ట్‌ ప్రాణం తీశారని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు 700 నేరపూరితమైన అభియోగాలను ఈ ముఠాపై నమోదు చేశారు.    

ఏం జరిగిందంటే.. 2017లో బ్రిటన్‌కు చెందిన మార్క్‌ సీ అనే వ్యక్తి పోలాండ్‌లో పర్యటించాడు. ఆ సమయంలో ఓ స్ట్రిప్ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితుడితో ఫుల్‌గా తాగాడు. ఆపై క్రాకో లో ఉన్న వైల్డ్‌ నైట్‌ క్లబ్‌కు చేరాడు. అక్కడ ఉచిత ప్రవేశం బోర్డు చూసి ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఫ్రీగా మందు తాగుతూ పోయారు. అయితే ఒక దశకు వచ్చేసరికి.. మార్క్‌ ఆపేద్దామనుకున్నా క్లబ్‌ నిర్వాహకులు ఊరుకోలేదు. గంటన్నరలో అతనితో 22 పవర్‌ఫుల్‌ షాట్స్‌ తాగించారు. ఇంకేం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు మార్క్‌.       

చనిపోయిన తర్వాత ఆ ముఠా.. అతని జేబులో ఉన్న డబ్బు లూఠీ చేసింది. అతని శవాన్ని, మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిని క్లబ్‌ బయటకు నెట్టేసింది. శవ పరీక్షలో.. మార్క్‌ ఒంట్లో బ్లడ్‌ ఆల్కాహాల్‌ కంటెంట్‌ 0.4 శాతంగా ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. లిక్కర్‌ పాయిజన్‌తోనే అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీష్‌ సెంట్రల్‌ పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో.. ఆరేళ్లుగా దర్యాప్తు చేసింది. మద్యం తాగించి మత్తులో మునిగిపోయే మందు బాబుల నుంచి డబ్బు, నగదు దోచుకుంటున్నట్లు.. ప్రత్యేకించి టూరిస్టులే టార్గెట్‌గా ఈ మోసం నడుస్తున్నట్లు తేల్చారు. తాజాగా ఈ కేసులో అభియోగాలు 

మనిషి శరీరం బ్లడ్‌లో ఆల్కాహాల్‌ లెవల్‌ 0.3కి చేరినా, అంతకు మించినా ఆల్కాహాల్‌ పాయిజనింగ్‌ జరిగినట్లు లెక్క. దొరికింది కదా అని వేగంగా మద్యం తాగడమూ ఆరోగ్యానికి హానికరమే. మాట, నడకలో తడబాటుతో పాటు తీవ్ర అనారోగ్యం బారినపడడం లేదంటే ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలతో గుండె ఆగిపోవడం లాంటి హఠాత్‌ పరిణామాలు ఎదురవుతాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top