670 కోట్ల అరుదైన చిత్రం!

Botticelli Painting Fetches Record 670 Crires At Auction - Sakshi

కళాచరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే చిత్రకారుల్లో ఇటాలియన్‌ చిత్రాకారుడు సాండ్రో బాటిచెలి ఒకరు. ఆయన చిత్రించిన అలనాటి చిత్రం ఒకటి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 15 వ శతాబ్దానికి చెందిన ఈ చిత్రం న్యూయార్క్‌లోని సోత్‌బీస్‌ యాక్షన్‌ హౌజ్‌లో 670 కోట్లకు అమ్ముడుపోయి కొత్త సంవత్సరంలో సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. ‘యంగ్‌ మ్యాన్‌ హోల్టింగ్‌ ఏ రౌండెల్‌’ అని పేరుగల ఈ చిత్రరాజాన్ని వేనోళ్ల పొగుడుతుంటారు కళాభిమానులు.

ఈ చిత్రం మార్కెటింగ్‌ కోసం నాలుగు నెలల సమయాన్ని వెచ్చించారు. లాస్‌ ఎంజెల్స్, లండన్, దుబాయ్‌లలో ప్రదర్శించారు. కళా, సాంకేతిక విషయాలకు సంబంధించిన విశ్లేషణతో 100 పేజీల కేటలాగ్‌ కూడా ప్రచురించారు. మొత్తానికైతే ఫలితం వృథా పోలేదు. చిత్రంలో ఉన్న వ్యక్తి గురించి చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు అనేది పక్కన పెడితే ఆ కాలానికి చెందిన సంపన్న, శక్తిమంతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అనే విషయంలో ఎవరికీ భేదాభిప్రాయాలు లేవు. అంత పెద్ద మొత్తం పెట్టి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన కళాభిమాని పేరు, వివరాలు ఇప్పటికైతే గోప్యంగా ఉన్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top