గణతంత్ర వేడుకలకు బ్రిటన్‌ ప్రధాని?

Boris Johnson invited as 2021 Republic Day chief guest - Sakshi

లండన్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆçహ్వానాన్ని అంగీకరిస్తే, 1993 తరువాత బ్రిటన్‌ ప్రధాని తొలిసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నవంబర్‌ 27న బ్రిటిష్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ జనవరి 26న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ ఆహ్వానించారు. అలాగే వచ్చేయేడాది బ్రిటన్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌కి ప్రధాని మోదీని, బోరిస్‌ ఆహ్వనించారు.

ప్రధాని నిర్ణయంపై అంతా ఆశ్చర్యపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ బ్రిటన్‌ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే దశాబ్దంలో భారత్, బ్రిటన్‌ల మధ్య సత్సంబంధాలను పెంచుకోవడానికి తన మిత్రుడు బోరిస్‌ జాన్సన్‌తో సుహృద్భావ చర్చలు జరిపినట్లు నవంబర్‌ 27న మోదీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. చివరిసారి 1993లో బ్రిటన్‌ ప్రధాని జాన్‌ మేజర్‌ భారత గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top