వెలుగులోకి వేల ఏళ్ల నాటి ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు 

Ancient Fast Food Centres Excavated In Pompeii - Sakshi

రోమ్‌ : ఇటలీలోని పాంపెలో అతి పురాతన ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు వెలుగు చూశాయి. 2019లో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. శనివారం వీటికి సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించారు. ప్రాచీన రోమన్లు భోజన ప్రియులన్న సంగతిని ఇది తెలియజేస్తోందని పాంపె ఆర్కియలాజికల్‌ పార్క్‌ చీఫ్‌ మాస్సిమో ఒసన్నా అన్నారు. వారు బయట తినడానికి కూడా ఇష్టపడేవారని, దాదాపు 80 రకాల ఫాస్ట్‌ ఫుడ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయని తెలిపారు. ఇలాంటివి దొరకటం ఇదే మొదటిసారని అన్నారు. దీనిపై ఆంథ్రోపాలజిస్ట్‌ వలెరియా ఎమోరెట్టి మాట్లాడుతూ.. ‘‘ ఆ ఫాస్ట్‌ ఫుడ్‌ కోర్టులు చాలా విశాలంగా మొత్తం ఇటుకలతో నిర్మించి ఉన్నాయి. ( 2021: ప్రపంచం అతలాకుతలమేనట! )

ఆహార పదార్థాలు వేసుకోవటానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడి ఉంది. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల గోడలపై అందమైన చిత్రాలు చిత్రీకరించబడి ఉన్నాయి. అక్కడ దొరికే పదార్ధాల గురించి తెలిపే విధంగా చిత్రాలు ఉన్నాయి. కోడి, బాతు, మేక, పందులు, చేపలు, నత్తలకు సంబంధించిన ఆహారం అక్కడ దొరికేది. ఆహారం రుచిగా ఉండటానికి అందులో వైన్‌ కలిపేవార’’ని తెలిపారు.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top